లారీ ఢీకొని ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - May 12 , 2024 | 11:50 PM
గండేపల్లి, మే 12: మండలంలో మల్లేపల్లి గ్రామ శివారున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థా నికుల సమాచారం ప్రకారం.. జగ్గంపేట నుంచి

గండేపల్లి, మే 12: మండలంలో మల్లేపల్లి గ్రామ శివారున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థా నికుల సమాచారం ప్రకారం.. జగ్గంపేట నుంచి రాజమండ్రి వైపు వెళ్లే ట్యాంకర్ లారీ మల్లేపల్లి గ్రామ శివారునకు వచ్చేసరికి ఆటో, మినీ వ్యాన్‌ను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన హైవే పోలీసు సిబ్బంది సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జగ్గంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.