Share News

రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:22 AM

కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో వడ్డివారిపేట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పల్లంకుర్రుకు చెందిన కన్నీడి లక్ష్మణ్‌ (20), సూర్యతేజ బలుసుతిప్ప నుంచి వస్తూ ఎదురుగా భార్యతో వస్తున్న స్థానిక వైద్యుడు మట్టా సిద్ధార్థగౌతమ్‌(56) వాహనాన్ని ఢీకొట్టారు.

 రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి

కాట్రేనికోన, మార్చి 5: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో వడ్డివారిపేట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పల్లంకుర్రుకు చెందిన కన్నీడి లక్ష్మణ్‌ (20), సూర్యతేజ బలుసుతిప్ప నుంచి వస్తూ ఎదురుగా భార్యతో వస్తున్న స్థానిక వైద్యుడు మట్టా సిద్ధార్థగౌతమ్‌(56) వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గౌతమ్‌, ఆయన భార్య మణిను స్థానికులు కాట్రేనికోన పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిద్ధార్థగౌతమ్‌ మంగళవారం మరణించారు. ఆయన భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు, సూర్యతేజ సురక్షితంగానే ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Mar 06 , 2024 | 12:22 AM