Share News

పరిశోధనకు నూతన వరి విత్తనాలు పంపిణీ

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:59 AM

పరిశోధన నిమిత్తం నూతన వరి రకాల విత్తనాలను రైతులకు అందజేసినట్టు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా వెంకట నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాళ్లపూడి, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో పరిశోధన నిమిత్తం వరిలో కొత్తరకాల విత్తనాలను అందజేశామన్నారు.

పరిశోధనకు నూతన వరి విత్తనాలు పంపిణీ
రైతులకు వరి విత్తనాలను అందిస్తున్న ఏరువాక శాస్త్రవేత్తలు

  • జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ నరసింహారావు

  • పలుచోట్ల రైతులకు అందజేత

దివాన్‌చెరువు, జూన్‌ 3: పరిశోధన నిమిత్తం నూతన వరి రకాల విత్తనాలను రైతులకు అందజేసినట్టు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా వెంకట నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాళ్లపూడి, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో పరిశోధన నిమిత్తం వరిలో కొత్తరకాల విత్తనాలను అందజేశామన్నారు. ప్రస్తుత సార్వా సీజనులో వరిలో నూతన వంగడాలైన ఎంటీయూ-1271, 1275, 1310, బీపీటీ-3082, 2858, 2841 వంటి రకాలను రైతుల కమతాల్లో పరీక్ష చేసి వాటి దిగుబడి, నాణ్యత, చీడపీడలను తట్టుకునేసామర్ధ్యం వంటి లక్షణాలను స్థానికంగా రైతులు వేస్తున్న ఎంటీయూ-7029, బీపీటీ-5204 వంటి రకాలతో పోల్చుతామన్నారు. రైతులు నారుమడులు పోసుకునే సమయంలోపే వాటిని అందజేశామని తెలిపారు. ఈ సార్వాకు సంబంధించిన రైతుల కమతాల్లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టామని నరసింహారావు పేర్కొన్నారు. రైతుల దిగుబడులను పెంచే దిశగా పరిశోధనలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం మరో ప్రధానశాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.హైమజ్యోతి తదితరులు పాల్గొన్నారన్నారు.

తాళ్లపూడిలో..

మండలంలోని వేగేశ్వరపురంలో రైతుభరోసా కేంద్రం వద్దకు జిల్లా ఏరువాక జిల్లా కేంద్రం కోఆర్డినేటర్‌ నరసింహరావు విచ్చేశారు. ఈ సం దర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో సార్వా వ్యవ సాయం చేపట్టే రైతులకు కొన్ని కొత్త వరి వంగడాలను పరిచయం చేసే కార్య క్రమం చేపట్టారు. దిగుబడి, నాణ్యత, వాతావరణం, చీడపీడలను తట్టుకునే ఎంటీయూ-1271, 1310, 1235, బీపీటీ-3082, 2585, 2841 వంటి వరి విత్తనాల గురించి వివరించారు. గతంలో ఉండే ఎంటీయూ-7029, బీపీటీ-5204 విత్తనా లతో పోలిస్తే ఇవి మెరుగైన విత్తనాలుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని రకాల విత్తనాలను కొత్త రకాల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. నారు మడులు కట్టుకునే సమయానికి విత్తనాలను పూర్తిగా సరఫరా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త హేమజ్యోతి, మండల వ్యవసాయాధికారిణి రుచిత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:59 AM