కొవ్వూరు ఆర్డీవోగా రాణి సుస్మిత
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:41 AM
కొవ్వూరు ఆర్డీవోగా డా.రాణి సుశ్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కొవ్వూరు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ఆశుతోష్ శ్రీవాస్తవ పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.
కొవ్వూరు, సెప్టెంబరు 30 : కొవ్వూరు ఆర్డీవోగా డా.రాణి సుశ్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కొవ్వూరు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ఆశుతోష్ శ్రీవాస్తవ పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆర్డీవోగా పనిచేస్తున్న రాణి సుశ్మిత బదిలీపై కొవ్వూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో సుశ్మిత మాట్లాడుతూ నా స్వగ్రామం కాకినాడ జిల్లా పిఠాపురం. 2022 గ్రూప్-1లో స్టేట్ ఫస్ట్ వచ్చా.. విశాఖపట్నంలో ట్రైనింగ్ పూర్తికాగా..ఫస్ట్ పోస్టింగ్ కళ్యాణదుర్గంలో 10 నెలలు పనిచేశా. ఎన్నికల అనంతరం బదిలీల్లో భాగంగా కొవ్వూరు వచ్చానన్నారు. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో ఎన్‌ఐటీ తిరుచ్చిలో పీహెచ్‌డీ చేశా. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్నా. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ పూర్తిచేశా. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నా. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా గ్రూప్- 1కు ఎంపిక య్యా. రీసెర్చ్ ఆర్టికల్స్, బుక్స్, లిటరరీ బుక్స్ పబ్లికేషన్ చేశానన్నారు.