Share News

రావులపాలెంలో చిరుత కలకలం

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:43 AM

రావులపాలెం గౌతమి వంతెన సమీపంలోని లంకల్లో చిరుత కనిపించిందంటూ ఆదివారం సోషల్‌ మీడియాలో ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఈ ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొంతకాలం నుంచి చిరుత పులి సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న సంగతి తెలిసిందే.

రావులపాలెంలో చిరుత కలకలం
చిరుత కలకలంతో రావులపాలెం గౌతమి వంతెనపై గుమ్మిగూడిన వాహనదారులు, ప్రయాణికులు

గౌతమి గోదావరి లంకల్లో చిరుత కనిపించిందంటూ హల్‌చల్‌

రావులపాలెం, సెప్టెంబరు 29: రావులపాలెం గౌతమి వంతెన సమీపంలోని లంకల్లో చిరుత కనిపించిందంటూ ఆదివారం సోషల్‌ మీడియాలో ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఈ ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొంతకాలం నుంచి చిరుత పులి సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు గంగరాజు, వెంకటేశ్వరరావు గౌతమి వంతెన సమీపంలోని లంకల్లో చిరుత పులి కనిపించిందని చెప్పినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించారు.

వదంతులు నమ్మొద్దు.. డీఎఫ్‌వో ప్రసాద్‌

చిరుతపులి సంచారమంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని డీఎఫ్‌వో ప్రసాద్‌ అన్నారు. చిరుతపులి కనిపించిందని ప్రచారం జరుగుతున్న ప్రాంతంలో పరిశీలించగా అక్కడ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. అయితే సోమవారం ఉదయం పూర్తిస్థాయిలో మరోసారి పరిశీలిస్తామని వదంతులు నమ్మొద్దని ఆయన తెలిపారు.

స్తున్నా.

Updated Date - Sep 30 , 2024 | 12:43 AM