ఎలుకల నివారణ సామూహికంగా చేపట్టాలి
ABN , Publish Date - Sep 21 , 2024 | 11:06 PM
ప్రస్తుతం సార్వా వరి పంటలో ఎలుకల బెడద తగ్గడనికి సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు కోఆర్డినేటర్ చల్లా వెంకటనరశింహరావు, ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ తెలిపారు. క్షేత్ర స్థాయి సందర్శనలో భాగంగా శనివారం మండలంలోని తొర్రేడులో వరి పొలాలను సందర్శించారు.
రాజమహేంద్రవరం రూరల్, సెప్టెంబరు 21: ప్రస్తుతం సార్వా వరి పంటలో ఎలుకల బెడద తగ్గడనికి సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు కోఆర్డినేటర్ చల్లా వెంకటనరశింహరావు, ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ తెలిపారు. క్షేత్ర స్థాయి సందర్శనలో భాగంగా శనివారం మండలంలోని తొర్రేడులో వరి పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం పరిధిలో సార్వా వరి ప్రస్తుతం ఈనిక దశకు దగ్గరలో వుందని, పంట ఆరోగ్యంగా వుందన్నారు. అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ఎండాకు తెగులు కనిపించిందన్నారు. అనంతరం ఎలుకల నివారణకు ఎలుక మందు పొట్లాలను రైతులకు పంపిణీ చేశారు. ఏరువాక ప్రయోగంలో భాగంగా మానిపండు తెగులు నివారణకు మందులను రైతులకు పంపిణీ చేసి సవ్యంగా రైతులతో పిచికారీ చేయించారు.