Share News

చౌక ధరల దుకాణాల నోటిఫికేషన్‌కు సన్నాహాలు

ABN , Publish Date - Aug 12 , 2024 | 12:30 AM

ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నిర్వహ ణకు సంబంధించి నోటిఫికే షన్‌ ఇచ్చేందుకు అధికారు లు సన్నాహాలు చేస్తున్నా రు. జిల్లాలో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న దుకాణాలను ఔత్సాహికులకు అప్పగిం చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా 1080 ప్రభుత్వ చౌకధరల దుకాణాలున్నాయి. కొంతకాలంగా 133 దుకాణాల నిర్వహణ ఖాళీగా ఉంది.

చౌక ధరల దుకాణాల నోటిఫికేషన్‌కు సన్నాహాలు

  • 133 రేషన్‌ డీలర్ల నియామకాలకు త్వరలో ప్రకటన

  • ఎదురుచూస్తున్న ఔత్సాహికులకు శుభవార్త

కలెక్టరేట్‌(కాకినాడ), ఆగస్టు 11: ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నిర్వహ ణకు సంబంధించి నోటిఫికే షన్‌ ఇచ్చేందుకు అధికారు లు సన్నాహాలు చేస్తున్నా రు. జిల్లాలో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న దుకాణాలను ఔత్సాహికులకు అప్పగిం చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా 1080 ప్రభుత్వ చౌకధరల దుకాణాలున్నాయి. కొంతకాలంగా 133 దుకాణాల నిర్వహణ ఖాళీగా ఉంది. కొంతమంది రేషన్‌డీలర్లు మృతి చెందడం, ఇంకొందరు దుకాణాల ను స్వచ్ఛందంగా వదిలేయడం వంటి వివిధ కారణాలవల్ల రేషన్‌ దుకా ణాల డీలర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో 133 దుకాణా లను గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు అప్పగించగా ఇప్పటి వరకు నిర్వహించారు. కొత్త ప్రభుత్వంలో వీటిని నింపేందుకు అధికా రులు సిద్ధపడుతున్నారు. కాకినాడ జిల్లాలో 6,54,718 రేషన్‌ కార్డులున్నా యి. ప్రతినెలా 9వేల టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. 650 టన్నుల గోధమపిండిని పంపిణీ చేస్తున్నారు. 21మండలాల్లో ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ జరుగుతోంది.

మండలాలవారీగా డీలర్ల ఖాళీల వివరాలు

జిల్లాలో మండలాలవారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే పిఠాపురం 1, గొల్లప్రోలు 8, కరప 6, కాజులూరు 4, యు.కొత్తపల్లి 4, సామర్లకోట 13, కాకినాడ అర్బన్‌ 36, కాకినాడ రూరల్‌ 8, పెదపూడి 6, తాళ్లరేవు 14, జగ్గంపేట 1, రౌతులపూడి 3, ప్రత్తిపాడు 5, శంఖవరం 4, కోటనందూరు 1, పెద్దాపురం 7, కిర్లంపూడి 4, తుని 1, తొండంగి 1, గండేపల్లిలో 6 దుకాణాలను నిర్వహించేందుకు ఖాళీలున్నాయి.

ప్రజాపంపిణీ వ్యవస్థ గాడిలో పడేనా?

ఇప్పటివరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో బియ్యం, గోధుమపిండి పంపిణీ చేస్తున్నారు. గత ఐదేళ్లలో అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, పంచదార ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యంతోపాటు కొన్ని నిత్యావసర సరుకులు ఇస్తామని ప్రకటించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి సమర్ధవంతంగా నడిపిస్తామని వెల్లడించారు. సజ్జలు, రాగులు, జొన్నలు ఇస్తామని ఇటీవల సీఎం చంద్ర బాబు ప్రకటించారు. సెప్టెంబర్‌ నుంచి పంచదార కూడా పంపిణీ చేస్తా మని సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూటమిప్రభుత్వంలో చౌకధర ల దుకాణాల నిర్వహణ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్డీవోల ఆధ్వర్యంలో..

కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌ల ఆర్డీవోలు నియామకాలపై నోటిఫికేషన్‌ ఇస్తారని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ తెలి పారు. త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నామన్నారు. నిర్ధేశించిన విద్యార్హతలు, రోస్టర్‌ ప్రకారం నియామకాలు చేపడతారన్నారు.

Updated Date - Aug 12 , 2024 | 12:30 AM