Share News

రంగా నేటి తరాలకు స్ఫూర్తిదాత

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:24 AM

స్వర్గీయ వంగవీటి మోహనరంగా నేటి తరాలకు స్ఫూర్తిప్రదాత అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. పట్టణ కాపు అభ్యుదయ సంఘాధ్యక్షు డు జిన్నూరి సాయిబాబా సారధ్యంలో రంగా జయంతిని గురువారం నిర్వహించారు.

రంగా నేటి తరాలకు స్ఫూర్తిదాత

ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు

ఘనంగా రంగా జయంతి

మండపేట, జూలై 4: స్వర్గీయ వంగవీటి మోహనరంగా నేటి తరాలకు స్ఫూర్తిప్రదాత అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. పట్టణ కాపు అభ్యుదయ సంఘాధ్యక్షు డు జిన్నూరి సాయిబాబా సారధ్యంలో రంగా జయంతిని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే రంగా విగ్రహనికి స్థానిక కాపు నేతలతో కలిసి పూలమాలలు వేసినివాళులర్పించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి, సాదనాల శివ,యాళ్లశ్రీను, జోన్నపల్లి సత్తిబాబు, శ్రీను పాల్గొన్నారు.

ఆలమూరు: ఆలమూరు మండల కాపు సంఘం అధ్యక్షు డు చల్లా ప్రభాకరరావు అధ్వర్యంలో ఆలమూరు మెయిన్‌రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాలలువేసి నివాళుల ర్పించా రు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. నాయకులు రామానుజుల శేషగిరిరావు, చల్లా నానాజీ, చల్లా వెంకటేశ్వరరావు, డీపీ రావు పాల్గొన్నారు. రంగా విగ్రహానికి కూటమి నాయకులు వంటిపల్లి సతీ్‌ ష్‌, ఈదల నల్లబాబు పూలమాలలువేసి నివాళుల ర్పించారు.

అంతర్వేది: అంతర్వేది సైకిల్‌షాపు సెంటర్‌, కేశవదాసుపాలెం కాల్వమొగ సెంటర్‌, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లిలంక, సఖినేటిపల్లి తదితర గ్రామాల్లో వంగవీటి రంగా జయంతిని నిర్వహించారు. అంతర్వేది, కేశవదాసుపాలెం కాల్వమొగ సెంటర్‌లో మాజీ సర్పంచ్‌ పోతురాజు నాగేంద్రకుమార్‌ అధ్యక్షతన రంగా విగ్రహానికి భారీ గజమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గన్నాబత్తుల సత్యనారాయణ, పోతురాజు శ్రీవెంకటకృష్ణ, కొమ్ముల తాతాజీ, ఉండపల్లి అంజి, జిల్లెల్ల నరసింహ, అడబాల శ్రీను, యెనుముల రమణ, బెల్లంకొండ ఏసు, దూది త్రినాథ్‌, చొప్పల బాబూరావు పాల్గొన్నారు.

అల్లవరం: మండలంలోని అల్లవరం, డి.రావులపాలెం, ఈటి వారిపాలెం, కొమరగిరిపట్నంల్లో రంగా జయంతి నిర్వహించా రు. టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు, జనసేన మండల నాయకుడు కంకిపాటి వీరబాబు, బండిగుప్తాపు సత్తిబాబు, రంగ, శ్రీవెంకన్న, సుంకర సాయి, కంకిపాటి సుబ్బరావు, కాకిలేటి సాయిరాం పాల్గొన్నారు.

అంబాజీపేట: అంబాజీపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఎదు రుగా ఉన్న రంగా విగ్రహానికి పలువురు నివాళులర్పిం చారు. ఇరుసుమండలో రంగా విగ్రహానికి జనసేన నాయకుడు అక్కి శెట్టి వీర వెంకట సత్యనారాయణ పూలమాల వేశారు. కార్యక్రమంలో గణపతి వీరరాఘవులు, కొర్లపాటి గోపి, దొమ్మేటి సాయికృష్ణ, కొర్లపాటి ఢిల్లీ, బొంతు పెదబాబు, మోటూరి చిన్న, వీరంశెట్టి దుర్గాప్రసాద్‌, రంకిరెడ్డి వీర్రాజు పాల్గొన్నారు.

పి.గన్నవరం: అక్విడెక్టువద్ద రంగా విగ్రహానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. జేఏసీ నాయకుడు అడ్డగళ్ల వెంకటసాయిరాం ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, బొండాడ నాగమణి, సంసాని పెద్దిరాజు, శిరిగినీడి వెంకటేశ్వర రావు, వాసంశెట్టి కుమార్‌, సాధనాల శ్రీవెంకటసత్యనారాయణ, తోలేటి సత్తిబాబు, ఆదిమూలం సూర్యనారాయణ, పప్పుల సాయిబాబు, యడ్ల ఏసు, షేక్‌ దొరబాబు, శేరు శ్రీనుబాబు, తాటికాయల శ్రీనివాసరావు, పెచ్చెట్టి ఈశ్వర్‌, కర్రి బాబురావు, నల్లా పెద్దకాపు, చింతపల్లి నందు పాల్గొన్నారు.

మామిడికుదురు: పెదపట్నంలంకలో సర్పంచ్‌ సుందరనీడి రాజేష్‌కుమార్‌, ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మామిడికుదురులో కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచారు. జనసేన నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు.

ఆత్రేయపురం: ఉచ్చిలి, లొల్ల, వాడపల్లి, మెర్లపాలెం, ర్యాలి, నార్కెడుమిల్లి గ్రామాల్లో రంగా విగ్రహాలకు పూలమాలలు వే సి నివాళులర్పించారు. రంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉప్పలగుప్తం: గొల్లవిల్లి సెంటర్లో రంగా విగ్రహానికి పలు వురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అరిగెల నానాజీ, ఆకుల సూర్యనారాయణమూర్తి, మద్దింశెట్టి సురేష్‌, సలాది నాగరాజు, చీకట్ల ఏసు, చిక్కం సూర్యమోహన్‌, సుంకర బుజ్జి, పైబోడి పండు, మద్దింశెట్టి ప్రసాద్‌, యెరుబండి భద్ర, గనిశెట్టి కిశోర్‌, సలాది పెదసత్యం, గనిశెట్టి రాము, గనిశెట్టి శివ పాల్గొన్నారు. విలసవిల్లిలో సలాది సతీష్‌ ఆధ్వర్యంలో రంగా జయంతి జరుపుకున్నారు.

రామచంద్రపురం/ద్రాక్షారామ: చప్పిడివారి సావరంలో రంగా విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌, కౌన్సిలర్‌ అంకం శ్రీనివాస్‌, కాపు సంఘం గౌరవాధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, అధ్యక్షుడు నారపరెడ్డి బలరామ్‌, కనకాల వెంకటేశ్వరరావు, అక్కల ఠాగూర్‌, కంచుమర్తి బాబూరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫద్రాక్షారామలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి వైస్‌ ఎంపీపీ శాకాబాబి, సర్పంచ్‌లు కొత్తపల్లి అరుణ, పెమ్మిరెడ్డి దొరబాబు, అనిశెట్టి రామకృష్ణ, జెడ్పీమాజీ వైస్‌ చైర్మన్‌ చింతపల్లి వీరభద్రరావు, కర్రిఅబ్బు, మాగాపు అమ్మిరాజు, నామా వెంకన్నబాబు, తోటబాబులు, డా.రాంబాబు, ఆళ్లబుజ్జి తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉట్రుమిల్లిలో రంగా విగ్రహానికి మాజీ ఉపసర్పంచ్‌ నున్న చిట్టిబాబు, కనకాల వెంకటేశ్వరరావు, నల్లసుదాకర్‌, నల్ల వెంకటేష్‌, అక్కిరెడ్డి శ్రీను, చిక్కాలస్వామికాపు నివాళులర్పించారు.

కె.గంగవరం: మండలంలోని కె.గంగవరం, సత్యవాడ, పామర్రు గ్రామాల్లో ఆయా గ్రామాల్లో కాపునాయకులు రంగా విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. మిఠా యిలు పంచారు. కె.గంగవరంలో జరిగిన కార్యక్రమంలో సలా ది వెంకన్న, తాడాల రాంబాబుల ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

రావులపాలెం: గోపాలపురం జాతీయ రహదారి సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకుల రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. మండలంలోని పలు గ్రామాల్లో రంగా జయంతిని ఘనంగా నిర్వహించారు.

కపిలేశ్వరపురం: మండలంలోని జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగుళ్ళ లీలాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంగర గాంధీ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పుత్సల శ్రీనివాస్‌, పిల్లా బసవరాజు, మత్సా గంగరాజు, మేడేపల్లి కొండ, చీకట్ల శ్రీను, యానాల సుబ్బారావు, సిద్దిరెడ్డి శ్రీను, గండ్రోతుల పట్టాభి, ఆటో కార్మికులు, తాపీమేస్త్రి, యూనియన్‌ నాయకులు, తదితరులు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దేవ

రాజోలు: బి.సావరంలో గురువారం స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన విగ్రహాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ, కుంపట్ల చిన్నారి, పామర్తి రమణ, గుండుబోగుల పెద్దకాపు, ఎంపీటీసీ దార్ల కుమారిలక్ష్మి, రావి మురళీ పాల్గొన్నారు.

రాజోలు: తాటిపాక సెంటర్‌లో రంగా విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కటికిరెడ్డి బుజ్జి, పోతు కాశీ, గుండాబత్తుల తాతాజీ, సాధనాల రమేష్‌, తాటికాయల బాబులు, లంకలపల్లి సుబ్బారావు, బోనం ఫణి, కటికిరెడ్డిసుబ్రహ్మణ్యం, గుండాబత్తుల కోటి, ఏపుగంటి సత్యనారాయణ, ఆకుల రమేష్‌ పాల్గొన్నారు.

కొత్తపేట: వాడపాలెం సెంటర్లోని రంగా విగ్రహానికి ఎమ్మె ల్యే బండారు సత్యానందరావు పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, పాతబస్టాండ్‌ సెంటర్లో కంఠంశెట్టి శ్రీనివాస్‌, బూసి భాస్కరరావు తదితరులు రంగాకు నివాళులర్పించారు. ముత్యాల బాబ్జీ, అద్దంకి చంటిబాబు, పెనుమల్ల అన్నవరం, ముద్రగడ సుబ్బారావు, చోడపనీడి భాస్కరరావు, త్సామా బాబు, బండారు రాజేష్‌, బండారు బుల్లితాత, బండారు వీరబాబు, చీకట్ల అబ్బు తదితరులు పాల్గొన్నారు.

రాయవరం: మండలంలోని సోమేశ్వరంలో దివంగత కాపునేత వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కాపునాడు మండలాధ్యక్షుడు నున్న వెంకటరమణ ఆధ్వర్యంలోరంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో దూళిపూడి వీరబాబు, మేడిశెట్టి నాగయ్య, నిమ్మకాయల బద్రీనారాయణ, చిన్నబాజ్జి, రామకృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.

అమలాపురం రూరల్‌/టౌన్‌: ఈదరపల్లి రంగా సెంటర్లో రంగా టీమ్‌ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధాకొండలరావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతిని నిర్వహించారు. చింతపల్లి చిన్నా ఆధ్వర్యంలో పలువురు రంగా విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్‌కుమార్‌, అబ్బిరెడ్డి సురేష్‌, సుందరనీడి నాయుడు, పోలిశెట్టి వీరబాబు, తిరుమనాథం జాంబ, మోటుపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. నల్లవంతెన దిగువున ఉన్న రంగా విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు నల్లా అజయ్‌, నల్లా సంజయ్‌, వంటెద్దు బాబి, కుడుపూడి శ్రీను, యార్లగడ్డ రవీంద్ర, జక్కంపూడి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:24 AM