Share News

అమలాపురంలో రంజాన్‌ చివరి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:46 AM

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 5: అమలాపురం మొల్లాముస్తఫా మసీదులో రంజాన్‌ మాసం చివరి శుక్రవారం కావడంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు, నమాజులు పవిత్రమైన వని ఈ సందర్భంగా మౌలానాలు పేర్కొన్నారు. పట్టణంలో ప్రసిద్ధమైన మొల్లా

అమలాపురంలో రంజాన్‌  చివరి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు
అమలాపురం మొల్లాముస్తఫా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లింలు

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 5: అమలాపురం మొల్లాముస్తఫా మసీదులో రంజాన్‌ మాసం చివరి శుక్రవారం కావడంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు, నమాజులు పవిత్రమైన వని ఈ సందర్భంగా మౌలానాలు పేర్కొన్నారు. పట్టణంలో ప్రసిద్ధమైన మొల్లాముస్తఫా మసీదులో ఇమామ్‌ హజరత్‌ మౌలానా మహమ్మద్‌ రజ్జాసాహేబ్‌, మహమ్మద్‌ సద్దాంసాహేబ్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనల్లో మసీదు కమిటీ ప్రతినిధులు ఎండీ అమీర్‌, ఎండీ ఆజామ్‌, ఎండీ బషీర్‌, ఎంఎంకేజీ మొహిద్దీన్‌, అబ్బాస్‌, ఖాదర్‌వలీ, నిజాం, ఎస్‌.లాల్‌, వలీ, జీఎం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:46 AM