Share News

రంప’లో 14 నామినేషన్ల తిరస్కరణ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:54 AM

రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొ త్తం 26 నామినేషన్లకుగాను 14 నామినేషన్లను తిరస్కరించినట్లు, 12 నామినే షన్లను ఆమోదించామని రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

రంప’లో 14 నామినేషన్ల తిరస్కరణ

12 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం

ఫ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్న ఆర్వో ప్రశాంత్‌కుమార్‌

రంపచోడవరం, ఏప్రిల్‌ 26: రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొ త్తం 26 నామినేషన్లకుగాను 14 నామినేషన్లను తిరస్కరించినట్లు, 12 నామినే షన్లను ఆమోదించామని రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. మొత్తంగా 17మంది అభ్యర్థులు 26 నామినేషన్లను దాఖలు చేయగా శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరు కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధుల సమ క్షంలో నామినేషన్లు పరిశీలించి లోపాభూయిష్టంగా ఉన్నా రెండు నామినేషన్లను తిరస్కరించామని, ఆయా అభ్యర్థులు ఒకటికి మించి దాఖలు చేసిన తొమ్మిది నామినేషన్లను తిరస్కరించామని, అసలు అభ్యర్థులకు ప్రత్యామ్నాయంగా దాఖలు చేసిన మూడు నామినేషన్లు కూడా తిరస్కరించామన్నారు. మొత్తంగా అభ్యర్థుల పరంగా చూస్తే మొత్తం 17 మంది అభ్యర్థులలో ఆయా కారణాల రీత్యా ఐదుగురు తిరస్కరణకు గురయ్యారు. పరిశీలనాంతరం ఆమోదించబడిన అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారు. కాకూరు కన్నంరెడ్డి(బహుజన సమాజ్‌పార్టీ), నాగులపల్లి ధనలక్ష్మి(యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌), మిరియాల శిరీషదేవి (టీడీపీ), లోతా రామారావు(సీపీఎం), దమంతు విశ్వనాధం(రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), మద్దేటి అంజిరెడ్డి(భారత ఆదివాసీపార్టీ), మనుపూడి సుబ్బారా వు (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), కుంజా శ్రీను(స్వతంత్ర), పల్లాల లచ్చిరెడ్డి (స్వతంత్ర), పాలడుగు లక్ష్మిప్రసన్న(స్వతంత్ర), పాలడుగు శ్రీవెంకటేశ్వరరావు (స్వతంత్ర), బంగారు వెంకటేష్‌(స్వతంత్ర)ల నామినేషన్లను ఆమోదించినట్లు తెలిపారు. కుంజం వీరవెంకట సత్యనారాయణమ్మ(స్వతంత్ర), తుర్రం అశోక్‌కు మార్‌(స్వతంత్ర), పూనెం సత్యనారాయణ(సీపీఎం), మిరియాల లోవలక్ష్మి (టీడీపీ), బొడ్డపాటి రాఘవ(వైసీపీ)ల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఏఆర్వో ఎ.జ్యోతికృష్ణ, తహశీల్దార్లు నాగరాజు, ఏవీ రమణ, సత్య సులోచన, సత్యనారాయణ, చలపతిరావు, నాగమణి, డీటీలు ఎన్‌వీవీ సత్యనారాయణ, బి.రాజు, శివ, చైతన్య, విశ్వనాధ్‌, శ్రీధర్‌, బాలాజీ, సత్యనారా యణ, మూర్తి, రామకృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్లు లక్ష్మణ్‌, పాల్‌బాబు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:54 AM