Share News

రాజమండ్రి లోక్‌సభలో త్రిముఖమే

ABN , Publish Date - May 03 , 2024 | 01:38 AM

చారిత్రక రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్‌టీఆర్‌ కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరిలో ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీని రెట్టింపుచేసింది..

రాజమండ్రి లోక్‌సభలో త్రిముఖమే

ఓటర్లకు వీయని ఫ్యాను గాలి

పురందేశ్వరికి బ్రహ్మరథం

పాత పరిచయాలతో గిడుగు పయనం

అనుభవలేమితో డాక్టర్‌ గూడూరి

రసవత్తరంగా మారిన వ్యూహాలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

చారిత్రక రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్‌టీఆర్‌ కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరిలో ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీని రెట్టింపుచేసింది.. ఈనెల 13న జరగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లోక్‌సభకు మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ త్రిముఖమే. మొత్తం 12 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ నుంచి రాజకీ యాలకు కొత్త అయిన డా.గూడూరి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీసీసీ మాజీ ప్రెసి డెంట్‌, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పోటీలో ఉన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ఓటర్ల సంఖ్య 16,23,149 మంది ఉన్నారు. పురుషులు 7,92,317 మంది, మహిళలు 8,30,735 , థర్డ్‌ జెండర్‌ 97 మంది ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ అత్యధిక ఓటర్లు, కొవ్వూరులో తక్కువ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే మహిళలే ఓటర్లు 38,418 మంది ఎక్కువగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలలోనూ మహిళలే ఎక్కువ. కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్‌ కుమార్తె కావడం వల్ల ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారు.బుధవారం రాత్రి కడియంలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. స్థానిక ఎన్‌టీఆర్‌ అభిమానులు ఆమెకు బెల్లంతో తులాభారం వేశారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తుండడం వల్ల పురందేశ్వరి బలం బాగా పెరిగినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికార వైసీపీ మీద, ముఖ్యంగా సీఎం జగన్‌ వైఖరి పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. ఇవన్నీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కలిసి వచ్చే అంశాలు. ఆమె ఇక్కడ ఎంపీగా గెలిస్తే కేంద్రం సహకా రంతో బాగా అభివృద్ధి చేస్తారనే ప్రచారం ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీని వాస్‌ రాజకీయాలకు కొత్త. కొన్ని నెలల కిందటే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మంచి డాక్టరే కావొచ్చు. కానీ రాజకీయ ఎత్తులు, వ్యూహాలు, ప్రజలను ఆకట్టుకునే విధానంలో వెనుకబడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గురించి పెద్దగా ప్రచారం చేయ డం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. రాజమ హేంద్రవరం లోక్‌సభకు పీసీసీ మాజీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్ర రాజు పోటీలో ఉన్నారు.ఒక వ్యూ హం ప్రకారం ఆయన కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటర్లపై దృష్టి పెట్టా రు. ప్రజలను ఆక ట్టుకుంటు న్నారు.అంతేకాక జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిలారెడ్డి జగన్‌కు వ్యతిరే కంగా కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఆమె ప్రభావం కనిపిస్తోంది.ఆమె మూడు రోజుల కిందట ఇక్కడ రోడ్‌ షో కూడా చేశా రు.వీరిద్దరూ కలసి వైసీపీ ఓట్లకు గండికొట్టే పరిస్థితులు కనిపిస్తున్నా యి. వాటికి తోడు వామ పక్షాల మద్దతు ఉంది.

గత ఎన్నికల తీరు ఇలా..

తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 1984 నుంచి 2019 వరకూ జరిగిన పది లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ మూడు సార్లు, బీజేపీ రెండు సార్లు, కాంగ్రెస్‌ నాలుగు సార్లు, వైసీపీ ఒకసారి గెలి చింది. మొత్తం 10 ఎన్నికల్లో టీడీపీ -బీజేపీలు 5 సార్లు, కాంగ్రెస్‌, వైసీపీలు 5 సార్లు గెలిచాయి. ఈ సారి 11వ సారి జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ -జనసేన- బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండగా, వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌, వామపక్షాల సహ కారంతో పోటీ చేస్తోంది.మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండడంతో అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి బలం పెరిగినట్టు అయింది.

అభ్యర్థులు వీరే..

దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ కమలం

గూడూరి శ్రీనివాస్‌ వైసీపీ ఫ్యాన్‌

గిడుగు రుద్రరాజు కాంగ్రెస్‌ హస్తం

పి.గణేశ్వరరావు బీఎస్పీ ఏనుగు

బి.బలరామకృష్ణ ఎన్‌సీపీ బకెట్‌

మేడా శ్రీనివాసరావు ఆర్‌పీసీ సిలిండర్‌

ఎన్‌.మోహనరావు జేబీఎన్‌పీ టార్చ్‌

జల్లి బాలనవీన స్వతంత్ర టెలిఫోన్‌

బీవీఎస్‌ఆర్‌ మూర్తి స్వతంత్ర బ్యాట్స్‌మెన్‌

కె.భానుచందర్‌ స్వతంత్ర క్యాలిప్లవర్‌

ఎం. రత్నారావు స్వతంత్ర గరాటు

ఎస్‌.రాఘవేంద్రరావు స్వతంత్ర సీసీకెమెరా

Updated Date - May 03 , 2024 | 01:38 AM