Share News

ఫ్యాన్‌ కింద గుబులు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:41 AM

వైసీపీలో గ్రూపులు రచ్చకెక్కాయి. రాజమహేం ద్రవరం పంచాయితీ సీఎం జగన్‌ వద్దకు చేరింది. సిటీ పరిఽధిలో వైసీపీ పలు గ్రూపులుగా విడిపో యిన సంగతి తెలిసిందే.. చాలా కాలంగా విభేదాలు న్నాయి.

ఫ్యాన్‌ కింద గుబులు

నేరుగా కలిసిన అసంతృప్తులు

వినిపించిన వేణుగాణం

కనిపించిన రాజాకీయం

సిటీలో బయటపడిన విభేదాలు

ఎన్నికల వేళా కలవని నేతలు

నేటికీ ఎడముఖం..పెడముఖం

భరత్‌కు దూరం..దూరంగా

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

వైసీపీలో గ్రూపులు రచ్చకెక్కాయి. రాజమహేం ద్రవరం పంచాయితీ సీఎం జగన్‌ వద్దకు చేరింది. సిటీ పరిఽధిలో వైసీపీ పలు గ్రూపులుగా విడిపో యిన సంగతి తెలిసిందే.. చాలా కాలంగా విభేదాలు న్నాయి. వైసీపీ సిటీ అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌తో పలువురు విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం సిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న సమయంలో ఎంపీ మా ర్గాని భరత్‌తో ఆయనకు పొసగలేదు. అప్పట్లో ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకునే స్థితికి చేరింది. ఆ సమయంలో అధిష్ఠానం వద్ద భరత్‌ మాట నెగ్గడంతో సిటీ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి సుబ్రహ్మణ్యం తప్పుకున్నారు.తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కోఆర్డినేటర్‌గా నియమిస్తే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు. తర్వాత భరత్‌కు అధి ష్ఠానం ఈ బాధ్యతలు అప్పగించింది. అనంతర పరిణామాల నేపథ్యంలో కొంత కాలం కిందట వైసీపీలో చేరిన ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థి గూడూ రి శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మరో పక్క రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సిటీపై పట్టు ఉంది. దీంతో ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే రాజాగా మారిన సంగతి తెలిసిందే.అప్పట్లో జగన్‌ వద్ద పంచాయతీ జరిగింది. ఇద్దరికీ గట్టిగా చెప్పడంతో కొంతకాలం మౌనంగా ఉన్నారు. తర్వాత ఎవరి కథ వారిదే. సిటీ యువజన కాంగ్రెస్‌నేతగా పీతా రామకృష్ణను నియమించినప్పుడు తనకు తెలియకుండా నియ మించడమేంటని, ఎమ్మెల్యే రాజా సోదరుడు గోదావరి జిల్లాల, వైసీపీ యూత్‌ కోఆర్డినేటర్‌ జక్కంపూడి రాజా ఎంపీపై ఫైర్‌ అయ్యారు. తర్వాత మిథున్‌రెడ్డి సమక్షంలో పీతా రామకృష్ణ , గణేష్‌ మధ్య గొడవ జరగడంతో మిఽథున్‌రెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రామకృష్ణను గణేష్‌ బెదిరించిన ఆడియో కూడా బయటకు రావడంతో ఎంపీ, జక్కంపూడి వర్గాల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ అర్ధమైంది. ఈ పంచాయతీ అంతా ఇలా ఉంటే ఎంపీ భరత్‌ సిటీ ప్రెసి డెం ట్‌గా ఉన్న నందెపు శ్రీనివాస్‌ను తప్పించి తనకు అనుకూలంగా ఉన్న అడపా శ్రీహరికి ఇప్పించిన సంగతి కూడా తెలిసిందే.అంతే కాకుండా రుడా చైర్‌పర్సన్‌ షర్మిళారెడ్డి వర్గంతోనూ ఆయనకు విభే దాలు ఉన్నట్టు సమాచారం.దీంతో ఎంపీకి శ్రిఘా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జక్కం పూడి రాజా వర్గం, నందెపు శ్రీని వాస్‌, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళా రెడ్డి వర్గాలు దూరంగా ఉంటున్నాయి. ఎన్నికలు వచ్చేసినా వీరి మధ్య సఖ్యత కుదరలేదు. సిటీ అభ్యర్థి భరత్‌ మాత్రం ఈ వర్గాలు ఎవరూ తనకు అవసరం లేదని,తాను చేసిన పనులే గెలిపిస్తా యనే స్థాయికి వెళ్లిపోయి.. ఈ వర్గాలను పూర్తిగా వదిలేసినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీ వల సీఎం జగన్‌ భరత్‌కు వ్యతిరేకంగా ఉన్న వారి ని తాడేపల్లి పిలిపించి మాట్లాడారు.దీనికి శ్రిఘా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, నందెపు శ్రీను, మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇటీవల వార్డు ఇన్‌చార్జిల నుంచి భరత్‌ తొలగించిన కొంత మంది నేతలు వెళ్లారు. మొదట శ్రిఘాకోళ్లపు, నందెపు వేర్వేరుగా జగన్‌ను కలిసి ఇక్కడ భరత్‌ ఒంటెద్దు పోకడల వల్లే సమస్య ఏర్పడిందని చెప్పి నట్టు తెలిసింది. వైసీపీలో కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని, ఆధారాలతో కూడా చూపినట్టు సమా చారం.ఈ సమయంలో భరత్‌ మీద ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పేసినట్టు తెలిసింది.అన్నీ విన్న తర్వాత ఎన్నికల సమయంలో ఐక్యం కాకపోతే దెబ్బతింటామని జగన్‌ హెచ్చరించినట్టు తెలిసింది. మిఽథున్‌ రెడ్డిని రాజమహేంద్రవరం పంపిస్తానని కూడా చెప్పినట్టు సమాచారం.ఈ నేతలంతా మూడు రోజుల కిందటే జగన్‌ కలిసినప్పటికీ.. స్థానికంగా నేత లలో ఏ మార్పు రాకపోవడం గమనార్హం. దీంతో వైసీపీలో గ్రూపిజం మరింత పెరిగినట్టు అయిం ది.ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గడ్డుకాలమే.

Updated Date - Mar 22 , 2024 | 12:41 AM