Share News

రాజమహేంద్రవరంలో జరిగింది అభివృద్ధి కాదు అవినీతి

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:25 AM

రాజమహేంద్రవరంలో జరిగింది అభివృద్ధికాదని అంతా అవినీతే జరిగిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజమహేంద్రవరంలో జరిగింది అభివృద్ధి కాదు అవినీతి

  • ఆర్పీసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 31: రాజమహేంద్రవరంలో జరిగింది అభివృద్ధికాదని అంతా అవినీతే జరిగిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం అభివృద్ధి పాలకులకు పట్టలేదన్నారు. డ్రైనేజీలు అస్తవ్య స్తంగా ఉన్నాయని, మురుగునీరు గో దావరిలో కలిసి దానిని మళ్లీ లిఫ్ట్‌ చేస్తే నగర ప్రజలు తాగుతున్నార న్నారు. గోదావరి కాలుష్య నియంత్రణ సాధ్యం కాలేదని ధ్వజమెత్తారు. అధి కార పార్టీ వారు నగరంలో ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రీయప్రజాకాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి, పారదర్శకత ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.అనంతరం ఆర్‌పీసీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సమావేశం లో పెండ్యాల కామరాజు, సిమ్మా దుర్గారావు, కాసా రాజు, డీవీ రమణమూర్తి, కె.యుగంధర్‌, సత్తి వెం కటరెడ్డి, ఎండీ ఇక్బాల్‌, ఆర్‌కే చెట్టి, దుడ్డె త్రినాథ్‌, సాయిదుర్గాప్రసాద్‌, లంక దుర్గాప్రసాద్‌, బర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 07:01 AM