Share News

రైతు బజార్‌లో కుళ్లిన ఉల్లిపాయలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:05 AM

రాజమహేంద్రవరం-కోరుకొండ రోడ్డు, శంభూనగర్‌ రైతుబజార్లలో మంగళవారం కుళ్లిన ఉల్లిపాయలను అధిక రేట్లకు విక్రయించడం విమర్శలకు తావిచ్చింది.

రైతు బజార్‌లో కుళ్లిన ఉల్లిపాయలు
మార్కెట్‌యార్డు రైతుబాజర్‌లో విక్రయిస్తున్న నాణ్యతలేని ఉల్లిపాయలు

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 11: రాజమహేంద్రవరం-కోరుకొండ రోడ్డు, శంభూనగర్‌ రైతుబజార్లలో మంగళవారం కుళ్లిన ఉల్లిపాయలను అధిక రేట్లకు విక్రయించడం విమర్శలకు తావిచ్చింది. మంగళవారం రాజమహేంద్రవరంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలు కిలో రూ.30 ధర పెట్టారు. ఈ ధరకు బహిరంగ మార్కెట్‌లోనే మంచి ఉల్లిపాయలు దొరకుతాయి. బహిరంగ మార్కెట్‌తో పోల్చితే రైతు బజారులో మరింత తక్కువకే ఉల్లిపాయలు లభించాలి. మార్కెట్‌యార్డు రైతు బజారులో మాత్రం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉల్లిపాయల వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగింది. నాణ్యత లేకపోయినా ధర దారుణంగా ఉండడంతో రైతు బజార్‌ నిర్వహణపై వినియోగదారులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే టమాటా ఎక్కువకు అమ్ముతున్నారనే ఫిర్యాదులున్నాయి. రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారి దీనిపై దృష్టిసారించాల్సి ఉంది.

Updated Date - Jun 12 , 2024 | 01:05 AM