Share News

రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఇంత నిర్లక్ష్యమా

ABN , Publish Date - May 24 , 2024 | 01:06 AM

రాజమ హేంద్రవరం రైల్వేస్టేష ను ప్రాంగణంలో ఉన్న రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌లో భద్రత గాలికొదిలేశారు. కాం ట్రాక్టరు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ప్రయాణికులు మండిపడు తునా ్నరు.

రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఇంత నిర్లక్ష్యమా

అగ్ని ప్రమాదం జరిగితే బూడిదే

భద్రత గాలికొదిలేశారు..

కాంట్రాక్టరు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ప్రయాణికుల మండిపాటు

రాజమహేంద్రవరం, మే 23(ఆంధ్రజ్యోతి): రాజమ హేంద్రవరం రైల్వేస్టేష ను ప్రాంగణంలో ఉన్న రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌లో భద్రత గాలికొదిలేశారు. కాం ట్రాక్టరు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ప్రయాణికులు మండిపడు తునా ్నరు. ఈ రెస్టారెంట్‌కి ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. పరిస్థితులు చూస్తే మాత్రం అగ్ని ప్రమాదం జరిగితే బూడిద మిగిలే విధంగా ఉన్నాయి. వంటల కోసం కోచ్‌ బయట గ్యాస్‌ సిలిండర్లను ఉంచారు. ఇవి ప్రమాదాన్ని ఆహ్వానించే విధంగా ఉన్నాయి. గ్యాస్‌ సిలిండర్లను వేడి నీళ్లలో పెట్టడం, వాల్చడం, భూమికి సమాంతరంగా ఉంచడం చేయ కూడదు. అలాగే నిండు సిలిండర్లను ఒకేచోట ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. సిలిండ ర్లకు ఎండ తగలకుండా ఏర్పాట్లు ఉండాలి. కానీ ఇక్కడ వాట న్నిటినీ ఉల్లంఘిస్తున్నారు. మొత్తం రెం డుచోట్ల సిలండర్లను ఉంచగా.. ఒకచోట సిలిండర్లను వేడి నీటిలో పెడుతు న్నారు. అక్కడికి దగ్గరగా మరోచోట 4 నిండు సిలిండర్లను ఒకేచోట ఉంచారు. దీనివల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రైలు కోచ్‌ రెస్టారెంట్‌ లోపల, బయట పెయింట్‌, లోపల సోఫాలు, అలంకరణకు వాడిన ఫ్లైవుడ్‌.. ఇలా అన్నీ మంటలు క్షణాల్లో వ్యాప్తి చెందేలా చేస్తా యి. పైగా ఈ కోచ్‌ లోపల ఇరుకుగా ఉండడమే కాకుండా బయటకు రావడానికి ఒకే చిన్నపాటి ద్వారం ఉంది. రాత్రి వేళల్లో ఈ రెస్టారెంట్‌ రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్‌లో కనీసం అగ్నిమాపక ఏర్పాట్లు కూడా లేకపోవ డంపై ప్ర యాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫైర్‌ ఎస్టింగ్విషర్‌ (అగ్నిమా పక సిలిండర్‌)లు కూడా లేవు. ఇటీవలే అధికారులు పలు అంశాల ఉల్లంఘ నలపై రూ.60వేలు జరిమానా విధించారు. అయితే, అత్యంత ప్రమాదకరమైన అంశాలను సంబంధిత విభాగాల అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శ లు వినవస్తున్నాయి. తనిఖీల్లో డొల్లతనం రుజువు అవుతోంది. రైల్వే అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, తమ పరిధిలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వ అధికారు లు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆ ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిషేధితంగా భావిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ను కూడా అనుసరించాలని, నిబంధన లను పాటించాలని రైల్వే ఒప్పందాల్లో ఉండడం గమనార్హం.

న్నాయి.

Updated Date - May 24 , 2024 | 07:48 AM