Share News

రైల్వే స్టేషన్‌లో మరమ్మతు పనులు

ABN , Publish Date - May 22 , 2024 | 12:48 AM

రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషనులో ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయవాడకు చెందిన సూర్యదేవర కన స్ట్రక్షన్స్‌ కంపెనీ ఈ పనులను రూ.1.80 కోట్లతో చేపట్టింది.

రైల్వే స్టేషన్‌లో మరమ్మతు పనులు
రాజమండ్రి రైల్వే స్టేషన్‌ రెండో ప్లాట్‌ఫాంపై పనులు

డీఈఎన్‌ స్వీయ పర్యవేక్షణ

రాజమహేంద్రవరం, మే 21(ఆంధ్రజ్యోతి): రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషనులో ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయవాడకు చెందిన సూర్యదేవర కన స్ట్రక్షన్స్‌ కంపెనీ ఈ పనులను రూ.1.80 కోట్లతో చేపట్టింది. ఈ నెల 6న గూడ్స్‌ రైలు రెండో ప్లాట్‌ఫాం వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజున విజయవాడ నుంచి డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధి కారుల బృందం వచ్చి ట్రాక్‌లను క్షుణ్ణంగా పరిశీలించింది. ఒకటి, రెండు ప్లాట్‌ఫాం పట్టాల కింద స్లీపర్ల(సిమెంటు కమ్మీలు) ను మార్చాలని నిర్ణయించారు. మొదటిగా రెండో ప్లాట్‌ఫాం వద్ద ప్రొక్లెయినర్లతో స్లీపర్లను తొలగిస్తున్నారు. సమాంతరంగా ఒకటో ప్లాట్‌ఫాం పనులను ప్రారంభిం చారు. రెండు ప్లాట్‌ఫాం ట్రాకుల స్లీపర్లను తొలగించి కొత్తవి వేస్తున్నారు. స్లీపర్ల కింద కూడా బేస్‌ను పటిష్టం చేస్తున్నారు. పనుల కారణంగా రెండో ప్లాట్‌ఫాంపై ట్రాఫిక్‌ని నిలిపివేశారు.ఈ ట్రాక్‌పై ట్రాఫి క్‌ని అనుమతించిన తర్వాత మొదటి ప్లాట్‌ఫాంపై రైళ్ల రాక పోకలను నిలిపి వేయనున్నారు. రెండు ట్రాక్‌ల మధ్య డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగు పరుస్తు న్నారు. మొత్తం పనులు పూర్తి కావడానికి నెల రోజులు పట్టే అవకాశం ఉంది. మరమ్మతు పనులను డీఈఎన్‌ రవికుమార్‌ సమ్మి విజయవాడ నుంచి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 4, 5 ప్లాట్‌ ఫాంలు అందుబాటులోకి రావడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. సాధా రణంగా పదేళ్లకోసారి ఈ పనులు చేయాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడంతో పట్టాల కింద బేస్‌ సామర్థ్యం తగ్గి రైలు పట్టాలు తప్పే వరకూ పరిస్థితి వచ్చింది. ఒకటి, రెండు ట్రాక్‌ లకు సంబంధించి కొంత భాగం 2008లో, మరికొంత 2013లో పనులు పూర్తి చేశారు. ట్రాక్‌ల వద్ద డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. ప్రతి రోజూ మొత్తం 160 రైళ్లు రాకపో కలు సాగిస్తాయి.22 టన్నుల యాక్సిల్‌ లోడ్‌తో ప్రయాణిస్తుంటాయి.

Updated Date - May 22 , 2024 | 12:48 AM