రా కదలిరా సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:59 AM
రా కదలిరా సభను విజయవంతం చేయాలి
మల్కిపురం, జనవరి 17: మండపేటలో ఈనెల20న జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొనే రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు. మల్కిపురంలో కొల్లాబత్తుల కుమార్ ఇంటి వద్ద జరిగిన రాజోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గమంతా తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు మండపేట వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారన్నారు. వైసీపీ అసమర్ధ పాలనలో రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు పూర్తిగా గ్రహించి చంద్రబాబుని మరలా ముఖ్యమంత్రిని చేయాలని బలమైన సంకల్పంతో ఉన్నారన్నారు. పరిశీలకులు కొత్తూరి రామరాజు, చిటికెన రామ్మోహనరావులు మాట్లాడుతూ మండపేట సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. జనసేన, టీడీపీ రాజోలు నియోజకవర్గ సమన్వయ కర్త గుండుబోగుల పెద్దకాపు మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్, చంద్రబాబుల ఆశయ సాధనకు మనమంతా కలిసిగట్టుగా పనిచేసి జగన్‌ను ఇంటికి పంపుదామన్నారు. మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ రుద్రరాజు పద్మరాజు, ఎంపీపీ కేతా శ్రీనివాస్, రుద్రరాజు వెంకటరామరాజు, కొల్లాబత్తుల కుమార్, అడబాల సాయిబాబు, అడబాల యుగంధర్, గుబ్బల శ్రీనివాస్, ముప్పర్తి నాని, మొల్లేటి శ్రీనివాస్, రాపాక నవరత్నం, చాగంటిస్వామి, బందెల పద్మ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.