Share News

ధాన్యం కొన్నదెంత

ABN , Publish Date - May 26 , 2024 | 01:09 AM

రబీలో పెద్దఎత్తున ధాన్యం సేకరించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను (ఆర్‌ బీకేలు) ఏర్పాటుచేసింది. అయితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంతో పౌరసరఫ రాల శాఖ సంస్థ వెనకబడింది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకంటే బహిరంగ మార్కె ట్‌లో ధరలు అధికంగా ఉండడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లోనే అమ్ముకోవడా నికి మక్కువ చూపించారు.

ధాన్యం కొన్నదెంత

రబీ టార్గెట్‌ లక్షా 92 వేల మెట్రిక్‌ టన్నులు

కానీ సేకరించిన ధాన్యం 26 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే

వెలవెలబోతున్న ఆర్‌బీకేలు.. కొనుగోళ్ల జాడే లేదు

రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.36.52 కోట్లు

ధాన్యం సేకరణలో పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వం

బయట మార్కెట్‌లో రేటు బాగుండడడంతో అటే రైతుల మొగ్గు

(కలెక్టరేట్‌-కాకినాడ)

రబీలో పెద్దఎత్తున ధాన్యం సేకరించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను (ఆర్‌ బీకేలు) ఏర్పాటుచేసింది. అయితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంతో పౌరసరఫ రాల శాఖ సంస్థ వెనకబడింది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకంటే బహిరంగ మార్కె ట్‌లో ధరలు అధికంగా ఉండడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లోనే అమ్ముకోవడా నికి మక్కువ చూపించారు. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబో తున్నాయి. కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌లో లక్షా 92 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జిల్లా పౌరసరఫరాల సంస్థ సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. దీనికోసం జిల్లాలో 414 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంతో ఆర్భాటంగా ఆరంభించింది. ధాన్యం తర లించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసింది. సిబ్బందిని నియమించి గోనె సంచులను సమకూర్చింది. అయితే బహిరంగ మార్కెట్‌ ధాన్యం ధర అధికంగా ఉండడంతో కొనుగోలులో వెనుకబడింది. సాధారణ రకం ధాన్యం 75 కిలోల బస్తాకు ప్రభుత్వం రూ.1,637 చొప్పున ఇస్తుంటే, బహిరంగ మార్కెట్‌లో రూ.1650 ధర పలు కుతోంది. అలాగే బొండాల రకం ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉండడంతో రైస్‌ మిల్లర్లు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు బొండాల రకం ధాన్యాన్ని మర పట్టించి నూకలను కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేస్తున్నారు. అలాగే కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బొండాల రకం ధాన్యం ద్వారా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్‌ రైస్‌ను ఎగుమతి చేస్తున్నారు. సన్నా రకాలకు కూడా అధిక ధరలు పలుకుతున్నాయి.

పేరుకుపోయిన బకాయిలు రూ.36.52 కోట్లు

కొనుగోలు చేసిన ధాన్యానికి సైతం సకాలంలో సొమ్ములను ప్రభుత్వం చెల్లించ లేకపోయింది. ఇప్పటివరకు రూ.56.89 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కేవలం రూ.20.32 కోట్లు మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఇంకా రూ.36.52 కోట్లు రైతులకు బకాయిపడ్డారు. గత ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యానికి నాలుగైదు రోజుల్లో సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని, ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు గడుస్తున్నప్పటికీ జమ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రాయితీలనే కాకుండా ధాన్యానికి ఇవ్వాల్సిన సొమ్ములు కూడా తీవ్ర జాప్యం చేస్తోందని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రబీలో ధాన్యం విక్రయించిన వాటికి ప్రభుత్వం సొమ్ములు సకాలంలో జమ చేయక పోతే ఇప్పుడు ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎలా పెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. సొమ్ములు జమకాకపోతే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రబీలో రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బు చెల్లించాలని కోరుతున్నారు.

ఈనెల 31వ తేదీతో మూతపడనున్న కేంద్రాలు

జిల్లాలో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే రబీ సీజన్‌ ముగియడంతో ఈనెల 31వ తేదీతో కేంద్రాలను మూసివేసేందు కు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇక జిల్లాలో 21 మండలాలు ఉండగా రబీలో సామర్లకోట మండలంలో అత్యధికంగా 5,624 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించా రు. అలాగే పెద్దాపురం మండలంలో 4213 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కరప మండలంలో 3944 టన్నులు, పెదపూడి మండలంలో 3939 టన్నులు, జగ్గంపేటలో 2699 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అలాగే కాజులూరు 1649 టన్నులు, కాకినాడ రూరల్‌ 156, పిఠాపురం 494 టన్నులు, తాళ్లరేవు 2038 టన్నులు, గండేపల్లి 44 టన్నులు, కిర్లంపూడి 936 టన్నులు, ప్రత్తిపాడు 30 టన్నులు, శంఖవరం 6 టన్నులు, ఏలేశ్వరరం 270 మెట్రిక్‌ టన్నుల ఽధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో మొత్తం 26 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా దీనిలో ఒక్క కాకినాడ రెవెన్యూ డివిజన్‌లో 17,848 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అటు పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో కేవలం 8200 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగారు.

ధాన్యం నిల్వలుంటే సంప్రదించాలి

జిల్లాలో ఎవరి దగ్గరైనా ధాన్యం నిల్వలుంటే సంప్రదించాలి. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు సకాలంలో సొమ్ములు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లో రైతులు సంప్రదించాలి. - బాలసరస్వతి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌

Updated Date - May 26 , 2024 | 01:09 AM