Share News

పులసకు బైబై!

ABN , Publish Date - Oct 19 , 2024 | 01:06 AM

పుస్తెలమ్మి అయినా పులస పులుసు తినాలనేది సామెత. గోదారోళ్ల కాస్త ఎటకారం ఎక్కువ.. అందుకే అలా చెబుతారని అనుకోవచ్చుగాని, వాటి ధరలు చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు.

పులసకు బైబై!
పులసలు

ఉప్పొంగినా జాడ లేని పులసలు

అక్కడక్కడా దొరికినా ధర వేలల్లోనే

ఒడిశా విలసలే చెలామణీ

మత్స్యకారులకూ తీవ్ర నిరాశే

(మండపేట- ఆంధ్రజ్యోతి)

పుస్తెలమ్మి అయినా పులస పులుసు తినాలనేది సామెత. గోదారోళ్ల కాస్త ఎటకారం ఎక్కువ.. అందుకే అలా చెబుతారని అనుకోవచ్చుగాని, వాటి ధరలు చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు. ఒకటో రెండో దొరికినా కిలో నుంచి రెండు కిలోలలోపు పులస ధర రూ.17 వేల నుంచి 25 వేల వరకు పలుకుతోంది. ప్రస్తుతం పులసల సీజన్‌ చివరికి వచ్చేసింది. అయినా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈసారి పదుల సంఖ్యలోనే పులసలు దొరికాయి. దశాబ్దం కిందట వందల సంఖ్యలో పులసల వేట సాగేది. గోదావరికి వరద నీరు (ఎర్ర నీరు) తగిలినపుడు ఇతర దేశాల నుంచి బంగాళాఖాతం సముద్రంలోకి వచ్చిన ఈ చేపలు గోదావరిలోకి చేరి ఏటికి ఎదురీదుతాయి. ఆ సమయంలోనే జాలర్లకు చిక్కుతాయి. ఈ పులసకు ఎందుకింత క్రేజు అంటే చేప రుచికన్నా పులుసు రుచి కోసమే పులసప్రియులు ఎగబడతారు. ఇప్పుడు వాటి అడ్రస్‌ గల్లంతైంది. దాదాపుగా ఇటువైపు రావడం మానేశాయి. ఎందుకు ఇలా మోహం చాటేశాయి...? ఏంటి కథ..?!ఏటా గోదావరికి వరదలు వచ్చే సమయంలో పులసల జాడ మొదలవుతుంది. సుమారుగా జూలై, ఆగస్టులో రెండు నెలలు ఈ రకం చేపలు దొరకడం జరిగేది. దీన్నే పులసల సీజన్‌గా పరిగ ణించేవారు. కానీ ఈసారి నుంచి గోదావరికి వర దనీటి తాకిడి అక్టోబరు వరకు కొనసాగడంతో సీజన్‌ ఇప్పటిదాకా కొనసాగింది. అఖండ గోదావ రిలోకి ఎర్రనీరు ముంచెత్తినప్పుడు ఈ అధిక జలాలను ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు సముద్రంలోకి విడిచిపెడతారు. సముద్రంలోకి ఈ గోదావరి తీపినీరు కలిసే సమ యంలో అక్క డున్న విలస చేపలు గోదావరిలోకి ఎదురీదుతూ వస్తాయి. అలా ఉప్పునీటి నుంచి మంచినీటిలోకి ప్రవేశించడంతో అవి పులసలుగా మారిపోతాయి. రుచికరమైన చేపలుగా మారడానికి కారణం ఉప్పునీటి నుంచి తీపి నీటిలోకి రావడమే. రోజు లు గడుస్తున్న కొద్దీ వీటి శరీరం మార్పు చెందు తూ ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా గోదావ రిలో గుడ్లను పెట్టేందుకే వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు. చేప బరువును బట్టి వాటి సంతానో త్పత్తి జరుగుతుంది. కిలో బరువు ఉన్న ఆడ చేప లక్ష గుడ్లను, రెండు కిలో లు ఉండే చేప రెండు లక్షలను పెడుతుంది. సముద్రం నుంచి ధవళేశ్వ రం వరకు పులస వలస వెళ్లే సమయంలోనే మత్సకారులు గోదావరిలో పులసలు వేట సాగిస్తుం టారు. అది కూడా పులసల వేట కోసం ప్రత్యేకంగా తయారుచేసిన సిల్క్‌ వలలను మాత్రమే వాడతారు. ఆడచేప సెనతో ఉండడంతో చాలా రుచితోపాటు పులుసు అద్భుతంగా రావడానికి అదే కారణం. కానీ పోతు చేపలకు అంత రుచి రాదు. కానీ మార్కెట్‌లో అన్నీ ఒకటే రకం చేప లుగా విక్రయించేస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌ ముగుస్తున్నప్పటికీ ఇప్పటి దాకా గోదావరిలో దొరికిన పులసలు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయి లోనే లభ్యమయ్యాయి. దాంతో ఎక్కడైనా చేప దొరికిందంటే కొనుగోలుదారులు వాలిపోతున్నా యి. పాట పెడితే వేలల్లో పాడుకుని సొంతం చేసుకుని ఇతర ప్రాంతాలకు పంపేస్తున్నారు. కానీ స్థానికంగా పులసలు తినే అవ కాశం మా త్రం ఎవరికీ లభించడం లేదు. నిజానికి పులసల సీజన్‌ వస్తే మత్స్యకారులకు కూడా పంట పండి నట్టు ఉండేది. ఎంత వెదికినా వాటి జాడలేకపో వడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారు. గోదావరిలోను, అటు సముద్రంలోను కలుషిత జలాల వల్ల పులసలు రావడం లేదని మత్స్యకా రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా గోదావరిలో పులసల వేట ఇటు ధవళేశ్వరం నుంచి అటు కోనసీమ, యానాం నదీ పరీవాహ క ప్రాంతాల వరకు సాగుతుంది. ఇక్కడ లభ్యం అయ్యే పులసలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ వాటి జాడలేకపోవడంతో పులస రుచి కూడా గత చరిత్రలానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పూర్వం పులసలు జూలై, ఆగస్టు మాసాల్లో మాత్రమే దొరికేవి. ఏటా ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల మేరక వ్యాపారం జరిగేదని చెబు తారు. ఇప్పుడు వరదలు నిన్న మొన్నటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గోదావరికి వరద నీటి తాకిడి తగులుతూనే ఉంది. దాంతో మూడు నెలలపాటు పులసల వేట సాగించారు. అక్కడక్కడ కిలో, కిలోన్నర చేపలు దొరికాయి. లేదంటే అర కిలో చేపలు ఇప్పటిదాకా దొరుకు తూ వచ్చాయని మత్స్యకారులు తెలిపారు.

ఒడిసా విలసలే చెలామణీ

పులసల జాడ తగ్గిపోయినా, వాటి రుచి చూడాలనే వారి సంఖ్య పెరిగింది. గతంలో ధవళేశ్వరం, ఆత్రేయపురం, బొబ్బర్లంక, కోటిపల్లి, కపిలేశ్వరపురం, పొట్టిలంక తదితర ప్రాం తాల్లో దొరికే పులసలకు మంచి డిమాండ్‌ ఉంది. తెల్లారేసరికి ఈ చేపల కోసం వివిధ ప్రాం తాల నుంచి వచ్చి కొనుగోలుదారులు వాలిపో యేవారు. ఇప్పుడు ఆయా మార్కెట్లలో పులస లు రావడం లేదు. దాంతో ఒడిసాలో విరివిగా దొరికే విలసలను ఇక్కడకు తెచ్చి పులసల పేరుతో విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్లలో మాత్రం ఈ రకం చేపలు అమ్మితే మత్స్యకార సంఘం తరపున పెనాల్టీలు వేస్తారు. దాంతో సమీపంలోనే ఇతర ప్రాంతాల్లో, ధవళేశ్వరం, యానాం ప్రాంతాల్లో ఒడిసా విలసలు విక్రయి స్తున్నారు. కొందరు వ్యాపారులైతే వాటిని విల సలుగానే చెప్పి మరీ విక్రయిస్తున్నారు. ధర కూడా రూ.500 నుంచి రూ.1550లోపే సైజు ను బట్టి దొరుకుతుండడంతో ఏదొకలే అని వాటినే జనం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు వాటి సరఫరా కూడా తగ్గిపోవడంతో మార్కె ట్‌లో సీజన్‌ ముగిసినట్టేనని భావిస్తున్నారు.

చీరమేనుదీ అదే పరిస్థితి..

గోదావరిలో చీరమేను అనే చిరుచేపల సీజన్‌ నడుస్తోంది. చీరమేను ఆశ్వయుజ మాసంలోనే దొరుకుతుంది. గోదావరి తీరంలో లభ్యమయ్యే ఈ సీరమేనును మత్స్యకారులు గోదావరిలోకి వెళ్లి చీరలతో వేటాడి బిందుల్లో వేసి మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తారు. శేరులు లెక్కన వీటిని విక్రయిస్తారు. ప్రస్తుతం వీటి ధర అధికంగానే ఉంది. దీపావళి వరకు మాత్రమే చీరమేను లభ్యమవుతుందని మత్స్యకారులు తెలిపారు. యానాం, ఎదుర్లంక, కోటిపల్లి ప్రాంతాల్లో చీరమేను వేట ఎక్కువగా సాగుతుంది. గోదావరి ఒక తెల్లటి తెట్టులాగా కనిపించగానే వేటాడతారు. ఇవి కూడా గోదావరిలో ఎదురీదుకుంటూ ధవళేశ్వరం చేరుకు నేసరికి చీరమేను కాస్తా ఇసుక దొందు లుగా రూపాంతరం చెందుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి దొరకడం కూడా గగనమైపోయిందని వారు వాపోతున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 07:21 AM