జనచంద్రం
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:46 PM
రాష్ట్రంలో దుర్మార్గపు సైకోపాలనను తరిమి కొట్టడానికి ్డటీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి కొవ్వూరు నుంచి వేలాదిగా తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు తరలివెళ్లారు.
కాతేరులో టీడీపీ రా.. కదలి రా బహిరంగ సభ
తరలిన తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు
బైక్‌లు ఆటోలు, కార్లు, బస్సుల్లో ర్యాలీగా వెళ్లిన శ్రేణులు
కొవ్వూరు, జనవరి 29: రాష్ట్రంలో దుర్మార్గపు సైకోపాలనను తరిమి కొట్టడానికి ్డటీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి కొవ్వూరు నుంచి వేలాదిగా తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు తరలివెళ్లారు. సోమవారం కొవ్వూరు గామన్‌బ్రిడ్జి అండర్ పాస్ వద్ద కొవ్వూరు ఇన్‌చార్జి గొల్లపల్లి సూర్యారావు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామారావు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్, నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాస్, నామాన పరమేష్ తదితరులు వెళ్లారు.
టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయం
రాజమహేంద్రవరంసిటీ/రూరల్/కడియం: జనవరి 29: కాతేరులో జరిగిన రా.. కదలిరా.. బహిరంగ సభలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిల అధ్యక్షతన సభ ప్రారంభమైంది. చంద్రబాబునాయుడు రాకకు ముందే ముఖ్య నాయకులు కొందరు సభలో మాట్లాడారు. గోపాలపురం టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం ముందు-తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిందని, అభివృద్ధి పఽథంలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో 42 ఏళ్ల తరువాత రాక్షస పాలన జగన్ రూపంలో వచ్చిందన్నారు. దీన్ని అంతమొందించేందుకు రా.. కదలిరాకు చంద్రబాబు పిలుపునిచ్చారని తెలిపారు. మోసపూరిత హామీలతో జగన్ మహిళల నెత్తిన చెయ్యి పెట్టారని, మద్యపాన నిషేధం అంటూ మహిళల తాళిబొట్లు తెంపేశాడన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేనలు కలిశాయని స్పష్టంచేశారు.
గోపాలపురం జనసేన ఇన్‌చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ అన్యాయంగా చంద్రబాబును 52 రోజులు జైలులో పెట్టి ఆధారాలు లేని కేసులో కక్షసాధింపులకు పాల్పడిన జగన్ ఆనాడే తన రాజకీయ పతనానికి నాంది పలికాడన్నారు. చంద్రబాబును పరామర్శించిన పవన్‌కల్యాణ్ ఆరోజు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఇరుపార్టీలు జగన్ పాలనపై పోరాడుతున్నాయన్నారు. నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో జగన్ రూ.9 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారాన్ని మోపాడని ధ్వజమెత్తారు.