సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:40 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు హెచ్చ రించారు. దేవరపల్లిలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేవీకే దుర్గా రావు అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
దేవరపల్లి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మద్దిపాటి
దేవరపల్లి, ఆగస్టు 24: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు హెచ్చ రించారు. దేవరపల్లిలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేవీకే దుర్గా రావు అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అధికారులు పారదర్శకతతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. స్థానిక సమస్యల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు పరిష్కారం కాకపోతే, వాటిని తన దృష్టికి తీసుకొస్తే జిల్లా, రాష్ట్ర స్థాయి అధి కారులతో సంప్రదించి పరిష్కరిస్తానన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమ న్వయంతో పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీపురం, పల్లంట్ల, కురుకూరు, త్యాజంపూడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కొవ్వూరు, గుండుగొలను జాతీయ రహదారిపై గడిచిన 16నెలల్లో 70మంది మృతి చెందినట్టు పోలీస్ రికార్డులు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స కోసం రాజమహేంద్రవరం, విజయవాడ వెళ్లాల్సి వస్తుందని, హైవే పక్కన సూపర్‌స్పెషాలిటీ ఆసు పత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని మద్దిపాటి అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేవరపల్లిలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైన్లు, వంతెనలు నిర్మాణం చేస్తామన్నారు. త్యాజంపూడి ఎంపీటీసీ వెంకటరత్నం మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుందని, దాని స్థానంలో కొత్త ట్యాంకు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ రామలక్ష్మి, ఎంపీడీవో ప్రభా కరరావు, ఎంపీటీసీ స్వర్ణలత, వైస్ ఎంపీపీ సాదే సుబ్బారావు, మండల ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.