Share News

అహంకారంతో విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరును తొలగించారు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:47 PM

అహంకార పూరితంగా విదేశీ విద్య పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబ్కేర్‌ పేరును తొలగించారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

అహంకారంతో విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరును తొలగించారు

మాజీ మంత్రి గొల్లపల్లి

మలికిపురం, ఫిబ్రవరి 20: అహంకార పూరితంగా విదేశీ విద్య పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబ్కేర్‌ పేరును తొలగించారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మంగళవారం గుడిమెళ్లంకలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాపాక నవరత్నం ఇంటి వద్ద జరిగిన దళిత నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి భారతదేశ దశ, దిశను మార్చిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని, అటువంటి గొప్ప వ్యక్తి పేరును విదేశీ విద్య పథకానికి తొలగించడం జగన్మోహన్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని అన్నారు. జూపూడి ప్రభాకరరావు తన మాటల్లో అంబేడ్కర్‌ పేరును తొలగించి జగన్మోహన్‌రెడ్డి పేరు పెట్టడం తప్పుకాదని సమర్థించడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో దోనిపాటి రాజు, రాపాక ఆనంద్‌కుమార్‌, రాపాక సత్యనారాయణ, కట్టా వెంకటరమణ, నాగిరెడ్డి గోపి, పితాని నాగరాజు, ముత్యాల శ్రీనివాస్‌, తాడి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన జూపూడి

విశ్వేశ్వరాయపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో దళితుల ఆత్మ గౌరవాన్ని జగన్‌ కాళ్లదగ్గర తాకట్టు పెట్టిన జూపూడి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి గెడ్డం సింహ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో జిల్లెల్లె బాబూప్రసాద్‌, కారుపల్లి ఏసురత్నం, తాడి సత్యనారాయణ, ఉండ్రాజవరపు బాబూరావు, పమ్మి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్ని వ్యవస్థలు నిర్వీర్యం: ఎమ్మెల్యే వేగుళ్ల

కపిలేశ్వరపురం, ఫిబ్రవరి 20 : వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్నివ్యవస్థలు నిర్వీర్యంగా మారాయని ఎమ్మెల్యే వేగు ళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండలంలోని వాకతిప్ప, నాగులచెరువు గ్రామాలలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింట పర్యటించిన ఆయనకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుంచె ప్రసన్నకుమార్‌, అల్లూరి రామకృష్ణచౌదరి, మాజీ ఎంపీటీసీ కడలి గోవిందు, నామాని వెంకటేశ్వరరావు, పితాని శ్రీనివాస్‌, రమణాతి శ్రీనివాసరావు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్ధులు పాల్గొన్నారు.

స్థానికులకే టీడీపీ టిక్కెట్‌ కేటాయించాలి

మామిడికుదురు, ఫిబ్రవరి 20: పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అభ్యర్థిత్వాన్ని స్థానికులకే కేటాయించాలని నియోజకవర్గ ఎస్సీ సెల్‌ సమావేశం తీర్మానించింది. నగరం గ్రామంలో ఎస్సీసెల్‌ సమావేశం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు జాలెం సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశంలో పలువురు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే స్థానిక నాయకులకు టిక్కెట్టు కేటాయిస్తే విజయం సునాయాసమవుతుందన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు పనితీరు బాగాలేదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీకి సీనియర్‌ నాయకులుగా ఉన్న జాలెం సుబ్బారావుకు అధ్యక్ష పదవి కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్యక్రమంలో ఎస్సీసెల్‌ నాయకులు బొంతు ఏడుకొండలు, ఉండ్రాజవరపు ప్రభుదాస్‌, జాలెం రమణకుమారి, పెదపూడి శ్రీనివాస్‌, మోర్త వెంకటేశ్వరరావు, గోగి రమేష్‌, నక్కా సత్యనారాయణ, నేదునూరి వెంకటరమణబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:48 PM