Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:29 AM

ప్రజాసమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కా రానికి కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వివే కానంద సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని శనివారం జేసీ రామ్‌సుందర్‌రెడ్డి, కాకినాడ కమిషనర్‌ భావనలతో కలిసి ఆయన నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌

కలెక్టరేట్‌(కాకినాడ), జూలై27: ప్రజాసమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కా రానికి కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వివే కానంద సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని శనివారం జేసీ రామ్‌సుందర్‌రెడ్డి, కాకినాడ కమిషనర్‌ భావనలతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటుచేశామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ సమావేశం ప్రతి శనివారం నిర్వహిస్తా మని, ఇందులో ప్రతి ఒక్క ఫిర్యాదును పరిశీలించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా రెవెన్యూ, పింఛన్ల మంజూరు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూ రికార్డుల ఆన్‌లైన్‌, కాలువల్లో పూడికలు తీయడం, శ్మశాన వాటిక స్థలాల మంజూరుచేయడం వంటి అంశాలుంటాయన్నారు. తాగునీరు క్లోరినేషన్‌ ప్రక్రియ అన్ని గ్రామాల్లో ఒక డ్రైవ్‌లా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో పంచాయతీలు, విద్యా, వైద్యం, ఆరోగ్యం, మత్స్యశాఖ, రోడ్డు భవనాలు, దివ్యాంగులు, విద్యుత్‌, వ్యవసాయం, జీజీహెచ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మైనింగ్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌ శాఖల్లో నమోదైన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు.

Updated Date - Jul 28 , 2024 | 08:17 AM