నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:01 AM
కార్పొరేషన్ (కాకినాడ), జూలై 7: ప్రభుత్వాదేశాల మేరకు సోమవారం ఉదయం 10.30గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు తెలిపారు. శారదాదేవి ఆలయ సమీపంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా స

కార్పొరేషన్ (కాకినాడ), జూలై 7: ప్రభుత్వాదేశాల మేరకు సోమవారం ఉదయం 10.30గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు తెలిపారు. శారదాదేవి ఆలయ సమీపంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్పొరేషన్ కార్యాలయ నెంబర్ 0884-2357800 నెంబరుకు సమస్యలు తెలియజేయవచ్చని తెలిపారు.