నేడు పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:00 AM
పిఠాపురం, జూలై 7: పట్టణంలోని రథాలపేట వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మల్టీపర్ఫస్ ఫంక్షన్‌హాలు వద్ద సోమవారం ఉదయం 10గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నియోజకవర్గస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ సహా జిల్లాస్థాయి దిగువ అధికారు లు, డివిజన్, నియోజకవర్గంలోని అధికారులందరూ ఈ వేదికకు హాజరు కానున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు పిఠాపురం, గొల్ల

హాజరుకానున్న కలెక్టర్
ఆర్జీదారుల కోసం హెల్ప్‌డెస్కు ఏర్పాటు
పిఠాపురం, జూలై 7: పట్టణంలోని రథాలపేట వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మల్టీపర్ఫస్ ఫంక్షన్‌హాలు వద్ద సోమవారం ఉదయం 10గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నియోజకవర్గస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ సహా జిల్లాస్థాయి దిగువ అధికారు లు, డివిజన్, నియోజకవర్గంలోని అధికారులందరూ ఈ వేదికకు హాజరు కానున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అర్హత ఉన్నా పింఛన్ అందకపోవడం సహా అన్ని రకాల ఫిర్యాదులను ఈ వేదిక ద్వారా స్వీకరించి పరిష్కారం చూపనున్నారు. వారం విడిచి వారం ప్రతి సోమవారం పిఠాపురంలో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని కలెక్టర్ షాన్‌మోహన్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఈ వేదిక నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9గంటలకు అధికారులందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. పరిష్కార వేదికకు భారీగా ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఏ ఆసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీలు అందించేందుకు వచ్చేవారి కోసం హెల్ప్‌డెస్కు ఏర్పాటు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనరు కనకారావు తెలిపారు. కాగా ఫంక్షన్‌హాలు వద్ద చేయాల్సిన ఏ ర్పాట్లపై పిఠాపురం సీఐ శ్రీనివాస్, పట్టణ ఎస్‌ఐ మురళీమోహన్ పరిశీలన జరిపారు.