Share News

గోదారిలో..గరళం!

ABN , Publish Date - May 21 , 2024 | 12:23 AM

పవిత్ర గోదావరి నీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు..ఆ నీరు కావాలంటూ అర్రులు చాస్తున్నారు.. అయితే రాజమహేంద్రవరంలో జరుగుతున్నది చూస్తే మాత్రం ఆ నీరు మాకొద్దు బాబోయ్‌ అంటారు. ఎందుకంటే.. రాజమహేంద్రవరం నగర ప్రజలు వాడిన నీటినే మళ్లీ శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు.

గోదారిలో..గరళం!
అపవిత్రమవుతుందిలా : రాజమహేంద్రవరంలో మురుగంతా గోదావరిలో కలిసేలా ఏర్పాటు చేసిన నల్లా చానల్‌ పైప్‌లైన్‌

రాజమండ్రిలో కలుస్తున్న మురుగు

కలుషితమవుతున్న నీరు

ఆ నీరే శుద్ధి చేసి తాగునీటిగా సరఫరా

రోగాలతో ప్రజలు సతమతం

నేటికీ పట్టించుకోని పాలకులు

రాజమహేంద్రవరం సిటీ, మే 20 : పవిత్ర గోదావరి నీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు..ఆ నీరు కావాలంటూ అర్రులు చాస్తున్నారు.. అయితే రాజమహేంద్రవరంలో జరుగుతున్నది చూస్తే మాత్రం ఆ నీరు మాకొద్దు బాబోయ్‌ అంటారు. ఎందుకంటే.. రాజమహేంద్రవరం నగర ప్రజలు వాడిన నీటినే మళ్లీ శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. దీంతో చారిత్రక రాజమహేంద్రవరం నగరం సురక్షిత తాగునీటి సమస్యతో కొట్టుమి ట్టాడుతోంది. నగరంలో 50 డివిజన్లలో సుమారు 4 లక్షల పైబడి జనాభా ఉన్నారు. గోదావరి పక్కనే ఉన్నా తాగునీటికి అల్లాడిపోతున్నారు. ఎందుకంటే నగరంలో 50 డివిజన్లకు నీటి సరఫరా చేసే ప్రధాన మంచినీటి విభాగానికి నగర ప్రజలు వాడిన నీరు కలిసే ప్రాంతానికి దూరం సుమారు 600 మీటర్లు మాత్రమే.. నగర ప్రజలు వాడిన నీరు గోదావరిలో కలిసే నల్లా చానల్‌ పాయింట్‌ గోదావరి ప్రవాహానికి ఎగువన ఉండగా, తాగునీటి కోసం లిఫ్ట్‌ చేసే ప్రధాన మంచినీటి విభాగం దిగువన ఉంది. దీంతో గోదావరి నీటిలో కలిసిన మురుగు నీటినే శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. ఆ నీటినే అందరూ తాగేస్తున్నారు.. పాలకులు మాత్రం ఆ మురుగునీరు కలిసే పాయింట్‌ మార్చేందుకు చర్యలు చేపట్టడం లేదు. పవిత్రమైనది గోదావరి.. పేరులోనే పవిత్రం.. నదిలో మాత్రం ఆ పవి త్రత కానరావడం లేదు.. అధికారుల అలక్ష్యం.. పాల కుల నిర్లక్ష్యం.. అఖండ గోదా వరికి శాపంగా మారాయి.. గోదా వరి నీటిలో ఏముంటుం దో ఒక్కసారైనా నదిలో పుణ్య స్నానం చేయాలనే స్థాయి నుంచి..ఆ నీటిలో అడుగు పెడితేనే సర్వరోగాలు వస్తా యనే స్థాయికి దిగజారి పోయి ంది.. దీనికి కారణం పాలకులే.. ఎం దుకంటే రాజమ హేం ద్రనగర ప్రజలు వాడే మురుగంతా కలిసేది జనం పవిత్రంగా భావించే గోదావరిలోనే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోనే అతి ఎక్కువ ఆదాయం కలిగిన కార్పొ రేషన్‌ అయినా.. నేటికీ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేక పోయారు.. పైపై మెరుగులు అద్ది అభివృద్ధి చేసినట్టు చెప్పే పాలకులు గోదావరి పవిత్రత అపవిత్రమవుతున్నా కనీసం కన్నెత్తి చూడలేదు. రాజమహేంద్రవరంలో అఖం డ గోదావరి(గౌతమి) ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఏడు పాయలుగా విడిపోతోంది. అవి గౌతమి, వశిష్ఠ, వైన తేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అనే సప్తర్షుల పేర్లతో పిలుస్తారు. అందుకే అంత పవిత్రత.. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయ మాత్రమే ప్రవహించే నదులు.. మిగిలినవి అంతర్వాహినులు.. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద సముద్రంలో కలు స్తోంది..అక్కడకు చేరే వరకూ గొంతు తడి పేందుకు ఈ నీరే.. చేను తడిపేందుకు ఈ నీళ్లే దిక్కు. అంత ప్రాధా న్యత ఉన్న గోదావరి రాజమహేంద్రవరం మురుగుతో అపవిత్రం అవుతున్నా కనీసం కదలిక లేదు.

గోదారున్నా.. తప్పని దాహం కేకలు

రాజమహేంద్రవరంలో అతి ముఖ్యమైనది సురక్షిత తాగునీటి సమస్య. దీనిని పరిష్కరించడంలో ఏ ఒక్కరు సఫలీకృతులు కాలేకపోయారు. టీడీపీ హయాంలో దిగువన ధవళేశ్వరం విజయ డైరీ ఎదురుగా ఒక 10 ఎమ్‌ ఎల్‌డీ ప్లాంట్‌, కోటిలింగాల పేట టింబర్‌ యార్డ్‌లో ఒక 10 ఎమ్‌ఎల్‌డి ప్లాంట్‌ నిర్మాణాలు జరిగాయి. కానీ ప్రధాన మంచినీటి విభాగాన్ని గోదావరి ఎగువకు తరలించలేదు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినా అనంతరం వచ్చిన ప్రభుత్వాల వల్ల కార్యరూపం దాల్చలేదు.పూర్వపు కమిషనర్‌ విజయరామరాజు ప్రధాన మంచినీటి విభాగం ఇన్‌టెక్‌ పాయింట్‌ను పైప్‌ల ద్వారా నదిలోకి తీసుకువెళ్ళారు.కానీ నల్లా చానల్‌ గోదావరి మలుపులో ఉండడం వల్ల మురునీరు ప్రవాహం గోదావరి ఒడ్డు నుంచి మధ్య వరకు ప్రవహిస్తుంది. ఎలాగైనా ముగురునీరే తగులుతుంది. దీంతో ఆ మురుగునీరే శుద్ధి చేసి సరఫరా చేసే పరిస్థితి ఉంది. ప్రధాన మంచి నీటి విభాగం నుంచి 65 ఎంఎల్‌డీ వాటర్‌, మిగిలిన రెండు చోట్ల నుంచి 20 ఎమ్‌ఎల్‌డీ వాటరు కలిపి మొత్తం నగరంలో 85 ఎమ్‌ఎల్‌డీ వాటర్‌ను శుద్ధి చేసి నగర ప్రజలకు అందిస్తున్నారు.వేసవి వచ్చిందంటే గోదావరిలో నీరు తగ్గి కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. తాగునీటి కొరత ఏర్పడుతుంది.

మురుగునీరే..శుద్ధి చేసి..

రాజమహేంద్రవరం ప్రజలు వాడిన మురుగు ప్రధాన డ్రైనేజీల గుండా తుమ్మలావ, ఆర్యాపురం ఎన్‌ఆర్‌సీపీ మీదుగా నల్లాచానల్‌కు చేరుకుటుంది. అక్కడ నుంచి నేరుగా గోదావరిలోకి వదులుతారు.. ఈ మురుగునీరు గోదావరిలో కలిసిపోతోంది. పుష్కరాల రేవు పక్కనే నగరపాలక సంస్థ ప్రధాన మంచినీటి విభాగం ఇంటెక్‌ పాయింట్‌ ఉంది. ఆ పాయింట్‌ వద్ద గోదావరి నీటితో కలి సిన మురుగు నీటీనే తోడేసి శుద్ధి చేస్తుంది. నగరపాలక సంస్థ ఈ నీటినే తిరిగి నగరంలో ప్రజలకు సరపరా చేస్తున్నారు. దశాబ్దాలకుపైబడి రాజమహేంద్రవరానికి పీడిస్తున్న దీర్ఘాకాలిక సమస్య ఇది. నగర ప్రజ లు వాడిన మూత్రం, మలినాలతో కూడిన నీటినే ఇనేళ్ల పాటు ప్రజ లు తాగేస్తున్నారు. అలాంటిది నీరు కలిసే చోటు చూస్తే ఒల్లు గగుర్పొడుస్తుంది. నగరంలో ప్రజలు అధికంగా జబ్బుల బారిన పడడానికి పరోక్షంగా ఇదే కారణం కావొ చ్చు.ఇదిలా ఉంటే గోదావరి నీరు అపవిత్రత గురించి తెలియని చాలా ప్రాంతాల వారు గోదావరి నీరు కావా లని డిమాండ్‌ చేయడం గమనా ర్హం. గత ఎన్నికల సమ యంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీల్లో ఇంటింటికీ గోదా వరి నీరు ఒక ప్రధాన హామీ. ఆ హామీ నెరవేర్చలేదు. రాజమహేంద్రవరంలో సమస్యకు పరిష్కారం చూపలేదు.

నూతన ప్రజాప్రతినిఽఽధులకు సవాళ్లు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేనెల 4న వెలువడనున్న తరుణంలో కాబోయే ఎమ్మెల్యే,ఎంపీకి నగరంలో ఇదే ప్రధాన సమస్య. దీనిపై కసరత్తు చేసి ప్రజలకు సురక్షితమైన తాగునీరందించాల్సి ఉంది. 2003లో ప్రధాన మంచినీటి విభాగాన్ని కాతేరు సమీపంలోకి తరలించాలనే ప్రతిపాదనలు ఉన్నా నెరవేరలేదు. అటుపై అప్పటి నుం చి తాగునీటి సమస్య అలాగే ఉంది.గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య పరిష్కరిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కానీ నిరాశ ఎదురైంది. 2024లో నూతన ప్రభుత్వమైన తాగునీటి విషయంలోను తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్న సుమారు 40 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి కాలుష్యాన్ని నియంత్రించాల్సి ఉంది. అంతే కాకుండా మురుగునీరు గోదావరిలో కలవకుండా చేసి సురక్షిత తాగునీరందించాలనేది ప్రజల కోరిక .దానిని ఎంత మేరకు నెరవేరుస్తారో వేచి చూడాలి.

Updated Date - May 21 , 2024 | 12:23 AM