Share News

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:03 AM

నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని 59 సెక్టార్‌ అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

రంపచోడవరం, జనవరి 11: నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని 59 సెక్టార్‌ అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చింతూరు నుంచి సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కె.చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. బూత్‌ స్థాయి, రూట్‌, సెక్టార్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించి సమన్వయం చేసుకొని చర్చించుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో సమస్యలుంటే తమకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ జి.డేవిడ్‌ రాజ్‌, డీఈఈలు చైతన్య, రాజేంద్రబాబు, ఏటీడబ్ల్యూవో రామతులసి, ఎలక్షన్‌ డ్యూటీ ఎన్‌వీవీ సత్యనారాయణ, అన్ని మండలాల తహశీల్దార్లు, మండల విద్యాశాఖాఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 01:03 AM