Share News

పోలింగ్‌ డే పర్యవేక్షణ బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించాలి

ABN , Publish Date - May 12 , 2024 | 01:52 AM

పోలింగ్‌ డే పర్యవేక్ష ణా విధానం(పీడీఎంఎస్‌),వెబ్‌ కాస్టింగ్‌ బాధ్యతలను ఆయా బృందాలు నిబద్ధతతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్ని కల అధికారి కె.మాధవీలత అన్నారు.

పోలింగ్‌ డే పర్యవేక్షణ బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత స్పష్టీకరణ

రాజమహేంద్రవరం కల్చరల్‌ మే11: పోలింగ్‌ డే పర్యవేక్ష ణా విధానం(పీడీఎంఎస్‌),వెబ్‌ కాస్టింగ్‌ బాధ్యతలను ఆయా బృందాలు నిబద్ధతతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్ని కల అధికారి కె.మాధవీలత అన్నారు. స్థానిక కలెక్టరేట్‌ సమా వేశ మందిరంలో శనివారం పీడీఎంఎస్‌, వెబ్‌ కాస్టింగ్‌ బృం దాలతో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులులతో కలసి కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధ వీలత మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గత ఆ రు నెలలుగా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.నేడు అత్యంత కీలకమైన దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ సరళి, వెబ్‌కాస్టింగ్‌ వివరాలు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యకలాపాల పురోగతి ,వాటి వివరాలు, పోలైన ఓట్ల ప్రగతి,సెక్టార్‌ వారీగా పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌, పోలింగ్‌ అధికారుల లాగిన్‌, డ్యాష్‌ బోర్డు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం జరిగింద ని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత తెలియజేశారు. వీటిపై ఎటువంటి సందేహాలున్నా, నివృత్తి చేస్తామన్నారు. ఇక్కడి నుంచి చేపట్టే పర్యవేక్షణ,రిపోర్టింగ్‌ తీరు కీలకం ఆన్నారు. ఆదివాదం ఉదయం 9 గంటలకు హాజరవ్వాలని, సోమవారం ఉదయం పోలింగ్‌ రోజున ఉద యం 5 గంటలకు రిపోర్ట్‌ చేసి, మంగళవారం అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి మెటీరియల్‌ తరలింపు పూర్తి అయ్యే వరకు బాధ్యత వహించాలన్నారు. సమయపాలన విషయంలో ఖచ్చితత్వం పాటించాలని, ఆదేశాలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏడు నియోజకవర్గాలకు ఏడు బృందాలను నియమించామని పేర్కొన్నారు. ఆయా బృందాలు నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకోవడం,సెక్టార్‌ అధికారులతో సంప్రదించి డేటా ఎంట్రీ వివరాలు పరిశీలన చేయడం కీలకం ఆన్నారు. పోలింగ్‌ పూర్తయిన తరువాత నన్నయ్య యూనివర్సిటీలో రిసెప్షన్‌ కేంద్రంకు పోలింగ్‌ మెటీరియల్‌ నిర్ణీత ఫారంలు ప్రకారం సరి చూసుకోవడం, వెబ్‌ కాస్టింగ్‌కు సబంధించిన వెబ్‌కాం, హార్డ్‌ డిస్క్‌ వంటివాటిని సెక్టార్‌ వారీగా తీసుకొని జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పిపిటి ద్వారా పీవో, ఏపీవోలు, సెక్టార్‌ అధికారులు, మాక్‌ పోల్‌, వాస్తవపోల్‌ వివరాలు నమోదు చేయడంపై పీడీఎంఎస్‌ యాప్‌లను లాగిన్‌ అవ్వడం, ఎవరైతే లాగిన్‌ అవ్వలేదో వారిని మే 12వ తేదీన లాగిన్‌ అయ్యేందుకు సంప్రదించాలని సూచించారు. ఆ మేరకు సంబంధిత అధికారికి ఫోన్‌చేసి లాగిన్‌ అవ్వడంపై సూచనల చేయా లన్నారు. ప్రీ పోల్‌,మాక్‌ పోల్‌,వాస్తవ పోలింగ్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమా వేశంలో ఆయా బృందాల సిబ్బంది హాజరయ్యారు.

రెండు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ప్రారంభం

దివాన్‌చెరువు, మే 11: లాలాచెరువు, హౌసింగ్‌బోర్డు కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోని 145 పోలింగ్‌ కేంద్రాన్ని మహిళా మోడల్‌ పోలింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దినట్లు జిల్లాకలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఉన్నత పాఠశాలలోని 145 మహిళా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని, 147 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ఓటర్లు అధికంగా ఉన్న 145 పోలింగ్‌ కేంద్రాన్ని మహిళా పోలింగ్‌ కేంద్రంగా గుర్తించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దామన్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలోనూ ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రాన్ని మహిళా మోడల్‌ పో లింగ్‌ కేంద్రంగా ఎంపిక చేశామన్నారు. మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు నేపఽథ్యంలో లాలాచెరువు హౌసింగ్‌బోర్డులోని పాఠశాల ప్రాంగణంలో రెండు పీఎస్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి తాగునీరు, వైౖద్యశిబిరం అందుబాటులో ఉంచడం ద్వారా ప్రత్యేక ఆకర్షణ కలిగించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మోడల్‌ మహిళా పీఎస్‌ 145లో మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించామని తెలిపారు. 145 పోలింగ్‌ కేంద్రంలో మహిళా ఓటర్లు 739 మంది, పురుషులు 683 మంది ఉన్నారన్నారు. 147 మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో పురుషులు 698 మంది, మహి ళలు 723 మంది ఓటర్లు ఉన్నారన్నారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో, రాజానగరం రిటర్నింగ్‌ అధికారి ఎ.చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ జగదీశ్‌

రాజమహేంద్రవరం, మే 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహించడానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ జగదీశ్‌ పేర్కొ న్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించి అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేశా మన్నారు. పోలింగ్‌ రోజున(సోమవారం) సెక్షన్‌ 144 అమలులో ఉంటుందన్నారు. తూర్పుగోదావరితోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన 1700 మంది పోలీసు సిబ్బంది, 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు విధుల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ జరగడానికి ప్రజలు సహ కరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానం ఉన్న వారు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచామన్నారు. వారి కదలికలను పర్యవే క్షిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ 1098 మంది రౌడీ షీటర్లను, 173 మంది గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిని బైండోవర్‌ చేశామన్నారు. 178 లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఏదైనా సమస్య ఉత్పన్న మైనా సంయమనం పాటించాలన్నారు. నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 12 , 2024 | 08:04 AM