Share News

ఓ..టర్న్‌ చేసింది!

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:04 AM

ఏడాదికి 365 రోజులు.. నెలలు గడిచాయి.. వారాలు గడిచాయి.. ఇక రోజులే ఉన్నాయి.. అది కూడా 2024లో మిగిలింది మూడు రోజులే.. అంటే 72 గంటల్లో కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం.. మరి 2024 ఏం చేసిందో తెలిస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది.. ఎందుకంటే చరిత్రకు సాక్ష్యం నిలిచింది..

ఓ..టర్న్‌ చేసింది!
రాజమహేంద్రవరంలో క్యూకట్టిన ఓటర్లు (ఫైల్‌)

మార్పు తెచ్చిన ’తూర్పు’తీర్పు

2024లో రాజకీయ సంచలనం

కూటమికి మద్దతుగా ఓటర్లు

అన్ని స్థానాల్లో క్లీన్‌స్వీప్‌

21 స్థానాల్లోను అఖండ విజయం

వైసీపీకి వాతపెట్టిన జనం

పిఠాపురం నుంచి బరిలో పవన్‌

రాజమండ్రి నుంచి పురందేశ్వరి

రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిన జిల్లా

చంద్రబాబు.. మోదీ ప్రచారం

ఓటు సంవత్సరంగా 2024

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఏడాదికి 365 రోజులు.. నెలలు గడిచాయి.. వారాలు గడిచాయి.. ఇక రోజులే ఉన్నాయి.. అది కూడా 2024లో మిగిలింది మూడు రోజులే.. అంటే 72 గంటల్లో కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం.. మరి 2024 ఏం చేసిందో తెలిస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది.. ఎందుకంటే చరిత్రకు సాక్ష్యం నిలిచింది.. ఎన్నో సమాధానంలేని ప్రశ్నలకు సమాధానమైంది.. ? ఓటు ఏం చేయగలదు.. పచ్చనోటుకు అమ్ము డుపోతోంది.. అదేం చెబితే అదే చేస్తుంది.. పథకాలకు అమ్ముడుపోతోంది.. ఎవరు ఎక్కువ ఇస్తే వారి వైపు ఉంటుంది.. ఇది గత ఎన్నికల ముందు వరకూ ఉన్న అపోహ.. అయితే 2024 మాత్రం ఓటు ఏం చేయగలదో నిరూపించింది.. మరో 30 ఏళ్లు నేనే సీఎం అన్న జగన్‌ను ఎక్కడ కూర్చో పెట్టాలో అక్కడే కూర్చోబెట్టింది.. మాకేంటి అని ఐదేళ్లు విర్రవీగిన నాయకులదీ అదే పరిస్థితి.. ఓటు బలమేంటో చాటిచెప్పింది.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐదేళ్ల వైసీపీ అరాచకానికి నిలువునా ఓటుతో పాతరేశారు.. జిల్లా రాజకీయ చరిత్రలో మును పెన్నడూ లేని విధంగా కూటమికి మొత్తం 21కి 21 సీట్లు కట్టబెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే 2024 ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసింది. రాజకీయ స్థితిగతులను మలుపుతిప్పింది. తూర్పు గోదావరి జిల్లాలో 2024 సరికొత్త రాజకీయ ఉదయానికి నాందిపలికింది. పవన్‌ గాలిలో.. చంద్రుడి వెలుగులో ఫ్యాన్‌ తునాతునకలైంది.2024.. మరో నాలుగు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోబోతోంది.. మరో కొత్త సంఖ్య కాలగమనం లోకి అడుగుపెట్టబోతోంది.. కానీ గతించిపోతున్న 2024 ఏడాది మాత్రం చరిత్రను తిరగరాసింది. ఓటు విలువ చాటి చెప్పింది.మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెను సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయడంలో కనివినీ ఎరుగని రీతిలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్రంలో ఐదేళ్ల అరాచకానికి నిలువెత్తు పాతరవేసింది. తనదైన తీర్పుతో చారిత్రక సాక్ష్యంగా నిలిచింది.

ఓటు ఊచకోత..

2024 ఏడాది అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు సాగాయి. ఈ సంవత్సరం ఐదేళ్ల వైసీపీ అరాచక ప్రభుత్వా నికి పాతరేసేలా అటు ఓటర్లు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాయి. ప్రత్యర్థి పార్టీలే కాకుండా ఓట్లేసి గద్దెనె క్కించిన ప్రజలను సైతం వైసీపీ తన అహం కార,అరాచక పాలనతో వేధించడంతో ఓటర్లంతా కసిగా నిశ్శబ్ధ యుద్ధం సాగించారు. అటు కూట మి పార్టీలు సైతం విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా ముందుకు సాగి చరిత్ర ఎరుగని భారీ విజయం సాధించాయి. వాస్తవానికి 2024, మేలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జనవరి నుంచే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకరేపాయి. ఈ ఏడాది జనవరి 26న పవన్‌ పొత్తులో భాగంగా తొలి జాబితా ప్రకటించారు. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని రాష్ట్రంలోనే తొలి రెండు సీట్లను ప్రకటించి వైసీపీపై రాజకీయ యుద్ధానికి నాంది పలికారు. అదేనెలలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల శంఖా రావం పూరించారు. ఉమ్మడి జిల్లాలో తునిలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆపార్టీ రాష్ట్రంలో అధి కారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌కు కొనసాగిం పు అన్నట్టు జనవరి 10న తుని నుంచి రా..కదలి రా..సభతో చంద్రబాబు తన ఎన్నికల శంఖారావం పూరించారు. జనవరి 23నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో చంద్రబాబు సతీమణీ భువనేశ్వరి సుడిగాలి పర్య టనలతో ప్రచార స్పీడు పెంచారు. మరోపక్క జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుం చే పోటీ చేస్తున్నట్టు మార్చి 14న ప్రకటించారు. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి జిల్లాపైనే పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లలో ఒక్కస్థానం కూడా వైసీపీకి రాకుండా చేసే బాధ్యత తనదని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో రాజకీయ వేడి మరింత పెరి గింది. మార్చి 16న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌, ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ కాక పెరిగిపోయింది. కూట మిలో ఏప్రిల్‌ రెండో వారం నాటికి అభ్యర్థుల లెక్క తేల్చేసి ఎన్నికల బరిలోకి దిగాయి. ఒకపక్క టీడీపీ అధినేత చంద్రబాబు.. మరో పక్క జనసేన అధినేత పవన్‌.. ఇంకోపక్క బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి సునామీ స్పీడుతో ఎన్నికల రణక్షేత్రంలో కదిలి జనచైతన్యాన్ని పెంచాయి.

ఫ్యాన్‌ రెక్కలు ముక్కలు..

ఐదేళ్ల అరాచకంతో విర్రవీగిన వైసీపీ ఈ ఏడాది జనవరి నుంచే జిల్లాలో చేదు జ్ఞాపకా లను మూటగట్టుకుంది. కాకినాడలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి నుంచి ఈ చివర తునిలో మంత్రి దాడిశెట్టి రాజా, రాజమ హేంద్రవరంలో మంత్రి వేణు.. ఇలా ఒకరేంటి ఎవరికివారే ఐదేళ్లు అధికారం మత్తులో జిల్లాను జుర్రేశారు. వీరందరికి తోడు ఎంపీ మిథున్‌రెడ్డి కడప నుంచి వచ్చి జిల్లాపై సాగిం చిన పెత్తనం, అక్రమాలు,దందాలు, స్కామ్‌లు జిల్లా ప్రజల్లో వైసీపీపై అసహ్యం పుట్టించేలా చేశాయి.అప్పటికే పన్నుల మోత, ఛార్జీల వాత,రీసర్వే పేరుతో భూముల్లో మతలబులు, ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులను లూటీచేసే ప్రయత్నాలతో ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెంచేసింది.దీంతో కాకినాడలో జనవరి 3న జగన్‌ పర్యటించిన సమయం లోను ప్రజలెవరూ రాకుండా ఆ పార్టీ ఓట మిని ముందే ఖాయం చేసేశారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత పేరుతో వారిని మార్చి కొత్తవారిని నిలబెట్టినా జనం ఆదరించలేదు. చివరకు పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు అప్పటికప్పుడు ముద్ర గడను పార్టీలోకి చేర్చుకోవడం, కడప నుంచి మిథున్‌రెడ్డి మనుషులను,వందలకోట్ల డబ్బును పంచినా ప్రజల ఛీత్కారం నుంచి వైసీపీ తప్పి ంచుకోలేక పోయింది. చివరకు ముద్ర గడను సొంతకూతురే చీల్చిచెండాడంతో వైసీపీ మరిం త పలుచన అయిపోయింది. చివరకు ఎన్నికల ఫలితాలతో ఫ్యాన్‌ రెక్కలు ముక్కలు ముక్కల య్యాయి.అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ కి క్యాడర్‌ కూడా ముఖం చాటేయడంతో 2024 ఆపార్టీకి పీడకలగా మారినట్లయింది.

అరాచకాన్ని అదిమిపట్టి.. ఓటుతో తొక్కేశారు!

మే 14న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అప్పటికే కూటమికి అధికారం కట్టబెట్టడానికి సిద్ధపడ్డ ఓటర్లు కనివినీ ఎరుగని రీతిలో పోలింగ్‌ బూ త్‌లకు పోటెత్తారు.పోలింగ్‌ సమయం ముగిసి నా సరే కదలకుండా అర్ధరాత్రి పన్నెండు దా టినా ఓట్లు వేసి తీరాలనే కసితో బారులు తీరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్ల పట్టుదల రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రా న్ని సమూలంగా మార్చేశాయి. జూన్‌ 4న వెల్ల డైన ఫలితాల్లో ఓటర్ల సునామీ తీర్పును కళ్లకు కట్టాయి. ఈ ఫలితాల్లో ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలతో పాటు రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పరిధిలోని రెండు సీట్లు కలిపి మొత్తం 21 స్థా నాల్లో కూటమి పార్టీ విజయం సాధించింది. అసలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా అధికార వైసీపీ గెలవలేదు.ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డంపెట్టుకుని విర్రవీగి ఉమ్మడి జిల్లాను అ న్ని విధాలా లూటీచేసిన వైసీపీ నేతలను ప్ర జలు ఈడ్చికొట్టారు. చెంప చెళ్లుమనే తీర్పు నిచ్చి పాతాళానికి తొక్కేశారు.కూటమిలో ఒక్కో ఎమ్మెల్యేకు రికార్డుస్థాయి మెజార్జీ కట్టబెట్టారు.

ముద్రగడ పద్మనాభరెడ్డిగా.. ముద్రగడ పద్మనాభం

ఫ 2024 ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణ ముద్రగడ పద్మనాభం. ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేశారు. ఈ ఎన్నికలో ఘోరంగా ఓటమి పాలవడంతో ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.

ఫ పి.గన్నవరంలో కూటమి అభ్యర్థిగా టీడీపీనుంచి మహాసేన రాజేష్‌ను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన స్వచ్ఛందంగా టిక్కెట్‌ వదులుకున్నారు. పోలీస్‌ విభాగంలో పనిచేసిన గిడ్డి సత్యనారాయణ జనసేన తరఫున అనూహ్యంగా ఆ టిక్కెట్‌ అందుకుని విజయం సాధించారు.

ఫ ఎన్నికల ముందు వరకూ జనసేనలో ఉన్న పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్‌ శేఖర్‌, టీడీపీలో ఉన్న గొల్లపల్లి సూర్యారావు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.

ఫ మునిసిపల్‌ కౌన్సిలర్‌ కుమారుడైన సుభాష్‌ అనూహ్యంగా రామచంద్రపురం టిక్కెట్‌ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యారు.

ఫ వైసీపీ ప్రభుత్వంలో రామచంద్రపురం, కొవ్వూరు నుంచి మంత్రులుగా కొనసాగిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత వారు పనిచేసిన నియోజకవర్గాల్లో కాకుండా రాజమహేంద్రవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు.

పదవులు వరించెన్‌

ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో కొందరిని అనూహ్యంగా ఉన్నత పదవులు వరిం చాయి.కొత్తవారికి మంత్రి పదవులు దక్కగా ఆయా పార్టీలకు విధేయులుగా ఉంటూ కూటమి గెలుపునకు కృషి చేసిన వారికి నామినేటెడ్‌ పోస్టులు లభించాయి. ఉమ్మడి జిల్లా నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. పలు కీలక శాఖలకు మం త్రిగా వ్యవహరిస్తున్నారు. నిడదవోలు నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేశ్‌ పర్యాటక శాఖ మంత్రి అయ్యారు. రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్‌ సామాజిక స మీకరణల్లో భాగంగా అనూహ్యంగా మంత్రి పదవి ద క్కించుకున్నారు. టీటీడీ బోర్డు మెంబర్లుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన పారిశ్రామికవేత్త అక్కిన మునికోటేశ్వరరావు ఎంపికయ్యారు. కౌడా చైర్మన్‌గా పె ద్దాపురం జనసేన ఇన్‌చార్జి తుమ్మలబాబు, రుడా చైర్మ న్‌గా బీవీఆర్‌ చౌదరి, ఆడా చైర్మన్‌గా ఎ.స్వామి నాయు డు, సివిల్‌ సప్లైస్‌ చైర్మన్‌గా జనసేన కాకినాడ నగర అధ్యక్షుడు తోట సుధీర్‌, శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మ న్‌గా కుడుపూడి సత్తిబాబు ఇంకా చాలామంది నాయ కులు ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎంపిక య్యా రు. తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబులను ప్రభుత్వ విప్‌లుగా ని యమించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జో గేశ్వర రావును శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, సీఎం ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌గాఉన్న టీడీపీ సీనియర్‌ నేత పెందుర్తి వెంకటేశ్‌కు కేబినెట్‌ హోదా కల్పించారు. ఇలా జిల్లాకు చెందిన పలువుర్ని పదవులు వరించాయి.

Updated Date - Dec 28 , 2024 | 01:04 AM