Share News

ఓటు..రూటు!

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:39 AM

జిల్లాలో రాజకీయం వేడెక్కింది..ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచారం జోరం దుకుంది. జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగ నున్నాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడంటూ ఎన్నికల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఓటు..రూటు!
రాజమహేంద్రవరంలో ప్రచారం చేస్తున్న ఆదిరెడ్డి వాసు, పురందేశ్వరి తనయుడు హితేష్‌

జనం బాట పట్టిన నాయకులు

హోరెత్తుతున్న ప్రచారం

కూటమి అభ్యర్థుల జోరు

రంగంలోకి కుటుంబీకులు

ప్రజల నుంచి విశేష స్పందన

వైసీపీకి కార్యకర్తలు దూరం

వలంటీర్లతో నెట్టుకొస్తున్న వైనం

మరో 10 రోజుల్లో నోటిఫికేషన్‌

( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రాజకీయం వేడెక్కింది..ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచారం జోరం దుకుంది. జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగ నున్నాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడంటూ ఎన్నికల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.ఎవరి నోట విన్నా ప్రజావ్యతి రేక వైసీపీ విధానాలపై విరుచుకుపడుతున్నారు. ఇంత వరకూ జరిగిన ఎన్నికలు వేరు. ఈసారి జరిగే ఎన్నికలు వేరు అన్నట్టు విధానాలు మారిపోయాయి. 2019 సాధా రణ ఎన్నికల వరకూ ఎవరైనా పోటీ చేయవచ్చు. ఎవ రైనా ప్రచారం చేసుకోవచ్చు.ఎవరైనా నెగ్గవచ్చు అనే విధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల ఎంత అప్రజాస్వామికంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వేయనీయ కుండా, పోటీకి ముందుకు రాకుండా కేసులు బనాయిం చడం,ప్రలోభాలు పెట్టడం వంటి అనేక అప్రజాస్వామిక విధానాలు కళ్లెదుటే కనిపించాయి. దీంతో చాలా చోట్ల ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితి ఏర్పడింది. పోరాడి స్థానిక ఎన్నికల్లో గెలిచినా అధికార వైసీపీని కాదని ఏమి చేస్తామనే ఉదాశీనత కూడా అప్పట్లో ఏర్ప డింది.తర్వాత క్రమంగా పరిస్థితులు మారాయి. సొసైటీ, కొన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించడానికి కూడా అధికార వైసీపీ భయపడిన సంగతి తెలిసిందే. దానికి రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికలే ఉదాహ రణ. వార్డు రిజర్వేషన్లు ఖరారు చేసి, మేయర్‌ రిజర్వేషన్‌ కూడా ఖరారు చేసినా ఎన్నికలు జరగనీయలేదు. దానికి తోడు రూరల్‌ మండలంలోని సుమారు 11 గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. వాటికి ఎన్నికలు నిర్వ హించలేదు. రాజానగరం, కోరుకొండ పరిధిలోని పలు పంచాయతీలను మొదట విలీనం చేసి తర్వాత ఆపే శా రు. ఇదే కాకుండా ప్రభుత్వ విధానాలు ప్రజలకు నచ్చ లేదు.ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలే త్వరగా ఎన్నికలు జరగాలని స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు.

ఓట్లు చీలకూడదనే జట్టుగా..

ఒక్క ఓటు కూడా చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి చాలా బలీయంగా ఉంది. జిల్లాలో కూటమి అభ్యర్థులందరూ ఖరారయ్యారు. కూటమిగా జట్టు కట్టడం వల్ల కొందరు ఆశావహులకు సీట్లు దక్కలేదు. త్యాగాలు తప్పవని,వారందరికీ అధికారంలోకి రాగానే స్థాయికి తగ్గని విధంగా హోదా కల్పిస్తామని హామీలు ఇస్తూ, బుజ్జగిస్తూ పార్టీలు ముందుకు పోతున్నాయి. అనపర్తి టికెట్‌ మారడం వల్ల మొదటి జాబితాలోనే టికెట్‌ పొం దిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి న్యాయం కోసం నల్లమిల్లి యాత్ర చేస్తున్నారు. తొలిజాబితాలో ఇచ్చిన పొత్తు నేప థ్యంలో అనపర్తి సీటును మార్చి బీజేపీకి ఇచ్చారు. ఈ సీటు విషయం కూడా తేలినట్టు సమాచారం. రేపో మాపో మళ్లీ రామకృష్ణారెడ్డికే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు అనేక చోట్ల వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 29తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది.మే 13న పోలింగ్‌. ఎన్నికలు దగ్గర పడు తుండడంతో అంతా ప్రచారంపై దృష్టిపెట్టారు.

ప్రచారంలో ఎవరి దారి వారిదే..

జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానం ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్య ర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, రెండు జనసేన, పార్లమెంట్‌ పాటు ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. జిల్లాలో కూటమి అభ్య ర్థులుగా రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డివాసు, గోపా లపురం మద్దిపాటి వెంకట్రాజు, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు కందుల దుర్గేష్‌,రాజమ హేం ద్రవరం రూరల్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి. కొవ్వూ రు ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీలో ఉన్న సంగతి తెలి సిందే.అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివ కృష్ణం రాజు పేరు వినిపిస్తున్నా..ఈ పేరు మారే అవకా శం ఉంది.నల్లమిల్లికే మళ్లీ టిక్కెట్‌ ఇచ్చే సూచనలున్నాయి. వీరంతా ఇప్పటికే ఊరారా ప్రచారం మొదలు పెట్టారు. సామాజిక వర్గాల వారీ సమావేశాలు నిర్వహిస్తూ హామీలు ఇస్తున్నారు.కుటుంబీకులు తమ వారి కోసం తీ వ్రంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో గోరంట్ల స్టయిలే వేరుగా ఉంది. సుమారు 10 రోజుల పైపైనుంచే ఇంటింటా ఓటర్ల వివరాలు సర్వే చేయించి నట్టు సమా చారం. అక్కడ ఎన్ని ఓట్లు, కులం, తదితర వివరాలు సేకరించడంతో పాటు ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తతో ప్రచారం చేయిస్తున్నారు. గోపాలపురంలో మద్దిపాటి మొదటి దఫా ఊళ్లలో పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిడదవోలు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌తో కలిసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రచారం చేస్తున్నారు. ఆదివారం దుర్గేష్‌ కుమార్తె ప్రియాంక రంగంలోకి దిగారు. రాజా నగరంలో జనసేన అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ కలసి ప్రచారం చేస్తు న్నారు. అంతే కాకుండా బలరామకృష్ణ భార్య, కుమా ర్తెలు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు,ఆదిరెడ్డి అప్పారావు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి తరపున ఆయన కుమార్తె శిరీష రంగంలోకి దిగారు. ఇక ఎంపీ అభ్యర్థిగా బలమైన నేత దగ్గుబాటి పురందేశ్వరి వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం సభతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సా హం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థులు విస్త్రతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పార్టీలో ఎవరి తీరు వారిదే అన్నట్టుగా ఉంది. ఒకరి ద్దరు తప్ప అందరూ పాత వాళ్లే కావడంతో వెన్ను పోట్లుకు సిద్ధమవుతున్నారు. పాలకులు ఐదేళ్లు కార్య కర్తలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మేముందుకు చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా నాయకులు వారి స్థానాల్లో వలంటీర్లను రాజీనామా చేయించి మరీ ఎన్నికల రం గంలోకి దింపు తున్నారు. దీంతో కార్యకర్తలు ఒక్కొక్కరుగా దూరమైపోతు న్నారు. ఇక మా అవసరం ఏముందనే ధోరణిలో నాయకులు, కార్యకర్తలు ఉంటున్నారు. ప్రచా రంలో కలిసి తిరిగినా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:39 AM