Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పోలియో చుక్కలు తప్పనిసరి

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:00 AM

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియోచుక్కలు తప్పక వేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పలుచోట్ల ఆదివారం నిర్వహించారు. పాలచర్ల పీహెచ్‌సీ పరిధిలోని దివాన్‌చెరువు, పాలచర్లలో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

 పోలియో చుక్కలు తప్పనిసరి

  • ఐదేళ్లలోపు పిల్లలకు నూరుశాతం పల్స్‌పోలియో జరపాలి

  • డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు

దివాన్‌చెరువు, మార్చి 3: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియోచుక్కలు తప్పక వేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పలుచోట్ల ఆదివారం నిర్వహించారు. పాలచర్ల పీహెచ్‌సీ పరిధిలోని దివాన్‌చెరువు, పాలచర్లలో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులం దరికీ నూరుశాతం పోలియో చుక్కలు వేయాలన్నారు. సిబ్బందిని ప్రత్యేక బృం దాలుగా ఏర్పాటు చేసి సోమ, మంగళవారాల్లో ఇంటింటా తిరిగి సర్వే జరపా లన్నారు. ఆసర్వేలో గుర్తించిన చుక్కలు వేయించుకోని వారికి వేయాలని డాక్టర్‌ బెనడిక్ట్‌కు సూచించారు. పీహెచ్‌సీ పరిధిలో 3435 మంది పిల్లలకు గాను 3210 మందికి ఆదివారం పోలియోచుక్కలు వేయడం ద్వారా 90 శాతం లక్ష్యం సాధించామని బెనడిక్ట్‌ తెలిపారు. మిగిలిన వారికి 3,4 తేదీల్లో ఇం టింటా తిరిగి వేయనున్నట్టు చెప్పారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్‌వా డీలు, ఆశ కార్యకర్తలు సేవలందించారు. దివాన్‌చెరువు పంచాయతీ రఘునాథ పురంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చిన్నారులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. బస్సు, రైల్వేస్టేషన్లలో ప్రత్యేక బృందాలతో పోలియో చుక్కలు వేయిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 01:00 AM