Share News

టుడే వాట్సాప్‌ స్టేటస్‌

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:39 AM

అవగాహన కల్పించడ మంటే ఏదో ఒకసారి చెప్పి వదిలేయడం కాదని, నిబంధనలను తరచుగా గుర్తు చేస్తూ ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎస్పీ నరసింహ కిషోర్‌ సోమవారం ఓ వినూత్న ప్రయోగానికి తెరతీశారు.

టుడే వాట్సాప్‌ స్టేటస్‌
పొలీసులు విడుదల చేసిన పోస్టర్‌

  • నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు యత్నం

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): అవగాహన కల్పించడ మంటే ఏదో ఒకసారి చెప్పి వదిలేయడం కాదని, నిబంధనలను తరచుగా గుర్తు చేస్తూ ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎస్పీ నరసింహ కిషోర్‌ సోమవారం ఓ వినూత్న ప్రయోగానికి తెరతీశారు. వా ట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టడం, చూడడం చాలామంది బాగా ఇష్టపడుతుంటారు. ఒక రకంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే స్టేటస్‌పైకి వేలు వెళ్లిపో తుంది. దీనినే ఆధారంగా చేసుకొని మహిళా భద్రత, సైబర్‌ నేరాలకు గురికాకుండా ఉండడం, ఇ ట్లో దొంగలు పడకుండా జాగ్రత్తలు, రహ దారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలు తదితర అంశాలపై ఎస్పీతో సహా జిల్లాలోని పో లీసులు అందరూ తమ వాట్సాప్‌ స్టేటస్‌లో ప్రతి రోజూ పోస్టులు పెడతారు. ఈ విధంగా ప్రతిరోజూ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఓ ప్రయత్నం మొదలు పెట్టామని ఎస్పీ వివరించారు.

  • పదవీ విరమణ పొందిన పోలీసులకు సత్కారం

జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన అధికారులను ఎస్పీ కిషోర్‌ ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. మహిళా పీఎస్‌ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ భీమేశ్వరరావు, ఏఆర్‌ ఎస్‌ఐ జి.సాయి కృష్ణ, వన్‌టౌన్‌ హెచ్‌సీ ఎంవీ రమణ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖకు వారు చేసిన సేవలను ప్రశంసించారు. ఉద్యోగ విరమణ అనంతర జీవనం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవసరత ఉన్నా తనకు నేరుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 12:39 AM