ఆటలు ఓటమిని భరించే శక్తినిస్తాయి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:41 AM
ఆటలు ఓటమిని భరించే శక్తిని.. కష్టాన్ని ఎదుర్కొన్నే ధైర్యాన్ని ఇస్తాయని ఎస్పీ నరసింహ కిశోర్ పేర్కొ న్నారు.

రాజమహేంద్రవరం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆటలు ఓటమిని భరించే శక్తిని.. కష్టాన్ని ఎదుర్కొన్నే ధైర్యాన్ని ఇస్తాయని ఎస్పీ నరసింహ కిశోర్ పేర్కొ న్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని మైదానంలో జిల్లా వార్షిక పోలీస్ క్రీడలు, క్రీడల పోటీలు-2024ను క్రీడల పతాకాన్ని ఎగురవేసి ప్రార ంభించారు. పోలీసుల్లో క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి పోలీస్ స్పోర్ట్స్ మీట్ దోహదపడుతుందన్నారు.నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసు లకు క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ చూ పిన వారు రాష్ట్ర పోలీస్ మీట్‌లో పాల్గొంటారన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మీట్‌లో 7 జోన్లకు చెందిన 7 టీమ్‌లు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, 100, 400, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్, క్రికెట్, టెన్నీస్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో పోటీలు ఉంటాయన్నారు.