160 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:40 AM
డొంకరాయి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న చెక్‌పోస్టు వద్ద గురువారం డొంకరాయి ఎస్‌ఐ శివకుమార్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయగా 160 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను, 2 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచ గ్రామానికి చెందిన షేక్ అక్బర్ హైదరాబాద్‌కు చెందిన షేక్ ఖాజావలి నాలుగు రోజుల క్రితం భద్రాచలం నుంచి సీలేరుకు పాసింజర్‌లను ఎక్కించుకుని అనంతరం పాసింజర్‌లను సీలేరులో దింపి సీలేరులోనే నాలుగురోజులు జల్సాగా తిరిగారు.

మోతుగూడెం, జూలై 4: డొంకరాయి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న చెక్‌పోస్టు వద్ద గురువారం డొంకరాయి ఎస్‌ఐ శివకుమార్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయగా 160 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను, 2 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచ గ్రామానికి చెందిన షేక్ అక్బర్ హైదరాబాద్‌కు చెందిన షేక్ ఖాజావలి నాలుగు రోజుల క్రితం భద్రాచలం నుంచి సీలేరుకు పాసింజర్‌లను ఎక్కించుకుని అనంతరం పాసింజర్‌లను సీలేరులో దింపి సీలేరులోనే నాలుగురోజులు జల్సాగా తిరిగారు. సీలేరులో ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి గంజాయి భద్రాచలం తీసుకెళ్తే రూ.30 వేలు కిరాయి ఇస్తామని చెప్పడంతో ఆటోలో 80 కిలోల గంజాయి చొప్పున రెండు ఆటోల్లో 160 కిలోల గంజాయి పెట్టుకుని గురువారం సీలేరు నుంచి భద్రాచలం బయలుదేరుతుండగా గంజాయి రవాణా చేస్తున్న సదురు రెండు ఆటోలను వెహికల్ చెకింగ్ చేస్తున్న డొంకరాయి ఎస్‌ఐ శివకుమార్ పట్టుకుని గెజిటెడ్ అధికారి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకట నానాజీ, వీఆర్వో సందీప్‌ఆచార్యులు, సురేష్ సమక్షంలో సీజ్ చేసి షేక్ అక్బర్, షేక్ ఖాజావలిను అరెస్ట్ చేశారు. చింతూరు సీఐ గజేంద్రకుమార్ ఆదేశాల మేరకు రంపచోడవరం జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు రిమాండ్ నిమిత్తం తరలించారు.