Share News

పోలీస్‌.. దందా!

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:53 AM

ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ జగదీశ్‌తో సహా జిల్లాలోని ఖాకీ యూనిఫాంలకు నిమిషం విశ్రాం తి దొరకడం లేదు.కౌంటింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వర కూ హైరానా పడుతున్నారు.ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలూ జరగకుండా ముందస్తు బం దోబస్తులో మునిగిపోయారు

పోలీస్‌.. దందా!

ఎన్నికల విధుల్లో ఎస్పీ బిజీబిజీ

కొందరు మాత్రం అలసత్వం

ఎన్నికల విధుల పేరుతో దోపిడీ

ఒక డీఎస్పీపై తీవ్ర ఆరోపణలు

సీఐ, ఎస్‌ఐలతో సొంత పనులు

ఇటీవలె హెచ్చరించిన ఎస్పీ?

అయినా మారని తీరు

పట్టుతప్పుతున్న ఖాకీలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ జగదీశ్‌తో సహా జిల్లాలోని ఖాకీ యూనిఫాంలకు నిమిషం విశ్రాం తి దొరకడం లేదు.కౌంటింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వర కూ హైరానా పడుతున్నారు.ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలూ జరగకుండా ముందస్తు బం దోబస్తులో మునిగిపోయారు.అల్లర్లు సృష్టిస్తే జైలు కు పంపిస్తామని ఐజీ అశోక్‌ కుమార్‌, పోలీస్‌ ఇమేజ్‌ని మరింత పెంచేలా విధులు నిర్వర్తించా లని డీజీపీ(శాంతి భద్రతలు) శంఖబ్రత బాగ్చి ఇటు ప్రజలకు అటు సిబ్బందికి స్పష్టం చేశారు. జిల్లాలో అల్లర్ల మాట ఎలా ఉన్నా.. ఇంటి దొంగల పని పట్టకపోతే మాత్రం కష్టమేననే చర్చ నడు స్తోంది. ఖాకీల్లోని కొందరి అలసత్వ తీరు, వారిని ఉన్నతాధికారులు హెచ్చరించి వదిలేయడం విమ ర్శలకు తావిస్తోంది.అసాంఘిక వ్యక్తులతో అంట కాగడం,అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించడం వంటివి కష్టపడి పనిచేసే సిబ్బ ంది, అధికారులను ఆవేదనకు గురిచేస్తు న్నాయి. ఎన్నికల బందోబస్తులో జిల్లా పోలీసులు తీరిక లేకుండా ఉండగా ఓ డీఎస్పీ మాత్రం ‘సొంత’ పనులు పురమాయిస్తూ ఇబ్బంది పెడు తున్నా రనే ఆరోపణలున్నాయి. నగరంలోని మరో డీఎస్పీ తీరుపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన ఎన్ని కల విధుల్లో కొనసాగుతూనే ఉన్నారు.

సబ్‌ డివిజనల్‌ అధికారిపై విమర్శలు

జిల్లాలోని ఓ సబ్‌-డివిజనల్‌ అధికారి ఇటీవల ఎన్నికల కోటాలో బదిలీపై వచ్చారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చీ రావడంతోనే ఎన్నికల ప్రొటోకాల్‌ని తన సొంత ప్రొటోకాల్‌గా మార్చేసుకొని అక్రమ ఆదాయంపై దృష్టి సారించారనే ఆరోపణలు ఆ శాఖ అధికా రుల నుంచి వినిపిస్తున్నాయి. తన కార్యాల యం లో ఏళ్లకు తరబడి పాతుకుపోయిన మరో చిరు అధికారి సహకారంతో ఇతర అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని సమాచారం. ఎన్నికల విధుల్లో ఎస్పీ తదితర అధికారులు, సిబ్బంది ఉంటే..ఆ అధికారి మాత్రం సీఐలు, ఎస్‌ఐలను తన సొంత వ్యాపకాలకు వాడుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవల సబ్‌-డివిజన్‌ పరిధిలోని ఓ గ్రామంలో జాతర జరుగుతున్న సందర్భంలో కోడి పందేలు,పేకాట శిబిరాలకు అవినీతి మా టున అనుమతిచ్చారని తెలిసింది. ఈ విషయం ఎస్పీకి తెలియడంతో ఆ అధికారిని తీవ్రంగా మం దలించారేగానీ..తదుపరి చర్యలు తీసుకోలేదని చర్చ నడుస్తోంది. మరో మండలంలోని ఓ గ్రా మంలో జరుగుతున్న జాతరకు కోడి పందేలకు, పేకాటలను చూసీచూడకుండా వదిలేయడానికి తనకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటూ ఆ జూదం నిర్వహించే వైసీపీ నాయకుడి గెస్ట్‌హౌస్‌కి వెళ్లి బేరసారాలు సాగించడం వివాదాలకు తావి స్తోంది. ఇలా తనకు లంచం ముట్టిన ప్రాంతాల్లో ఎలాంటి తనిఖీలు చేయవద్దని, నోరుమూసుకొని కూర్చోవాలని ఆయా పరిధుల్లోని అధికారులను ఆయన బెదిరిస్తున్నట్టు సమాచారం. అనుకూ లంగా ప్రవర్తించకపోతే పాత కేసులను తిరగతోడి చార్జిమెమోలను జారీచేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ అధికారి ఆయన కార్యా లయం లోనే నివాసం ఉండే అవకాశం ఉన్నా ప్రత్యేకంగా ఓ ప్రైవేటు ఇంటిలో ఉంటూ గ్యాంబ్లర్స్‌తో లావా దేవీలు చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోనే పేరు పొందిన ఓ గ్యాంబ్లర్‌ ఆ అధికా రికి కుడిచేతిగా వ్యవహరిస్తూ సెటిల్‌మెంట్లలో కీలక మధ్యవర్తిగా ప్రవర్తిస్తు న్నాడని వినవ స్తోంది.ఆయన తీరుతో కింది స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పోలీస్‌ సిబ్బంది, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిపై నిఘా విభాగం ఆరా తీసి ఎస్పీకి సమర్పించడం, దానిపై ఆయన చర్యలు తీసుకోవడం తక్షణ అవసరం. సొంత పనులకు ప్రాధాన్యం ఇచ్చేవారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడం శ్రేయస్కరం.

వైసీపీ పోస్టుకు కానిస్టేబుల్‌ కామెంట్‌..

పోలింగ్‌ రోజున దొమ్మేరులో చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.ఇప్పటికీ వైసీపీ నాయకులంటే భయం వారిలో కనిపిస్తోంది. పోలీసు అబ్జర్వర్‌ ఘటనా ప్రదేశానికి వెళ్లినా ఫలితం లేకపోయింది. కొవ్వూ రు రూరల్‌ పీఎస్‌లోని ఓ కానిస్టేబుల్‌ చేసిన పనిపై రగడ రేగుతోంది. వైసీపీకి అనుకూలంగా వచ్చిన పోస్టుకు ‘బాగా విశ్లేషించారండీ’ అంటూ కామెంట్‌ పెట్టడం వివాదానికి తావిస్తోంది.

ఇద్దరు కౌంటింగ్‌ ఏజెంట్లకు క్రిమినల్‌ కేసులు?

కౌంటింగ్‌ ఏజెంట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్ప టికే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ ఏజెంట్లు రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కౌంటింగ్‌ ఏజెంట్లుగా నమోదు చేసుకున్న ఇద్దరు వైసీపీకి చెందిన వారిపై కేసులు ఉన్నాయని చెబుతున్నారు. కౌంటింగ్‌ సిబ్బంది విషయంలోనూ జాగ్రత్తలు అవసరం.70 కార్డన్‌ సెర్చ్‌లు చేశామని ఎస్పీ చెబుతున్నా.. లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, ఫాంహౌస్‌లు, అపార్ట్‌మెంట్లలో అపరిచిత వ్యక్తుల గురించి సోదాలు మాత్రం జరగలేదు. మరో రెండు రోజుల్లో కౌంటింగ్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టెన్షన్‌ నెలకొంది.

Updated Date - Jun 02 , 2024 | 12:53 AM