ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయవచ్చు
ABN , Publish Date - Jul 19 , 2024 | 12:43 AM
కొత్త చట్టాల ప్రకారం స్టేషను పరిధితో సంబంధం లేకుండా జిల్లాలోని ఏ ప్రాంతం లోని పోలీసు స్టేషన్‌లో అయినా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): కొత్త చట్టాల ప్రకారం స్టేషను పరిధితో సంబంధం లేకుండా జిల్లాలోని ఏ ప్రాంతం లోని పోలీసు స్టేషన్‌లో అయినా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు.జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు పలు అంశాల గురించి వివరించారు. ఘటనా ప్రదేశం తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తిరస్క రించడానికి వీల్లేదన్నారు. ఫిర్యాదు స్వీక రించి విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధి పోలీస్ స్టేషనుకు సదరు ఫిర్యాదును బదిలీ చేయాలని తెలిపారు. కోర్టు అనుమతి లేకపోయినా పోలీసులు నేరుగా అరెస్టు చేసే వాటిని కాగ్నిజబుల్ కేసులు అం టారన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిధి, ఫిర్యాదుదారు ఎవరనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలన్నారు. బాధితులు, కుటుంబ సభ్యులు లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో కూడా మహిళలు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంద న్నారు. మహిళల భద్రత, రక్షణ, రూల్ ఆఫ్ లా, పోలీసు సమస్యలు, శాంతి భద్రతలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై మహిళా పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పోలీసు సహాయం అవసరమైన వారు డయల్ 112 టోల్‌ఫ్రీ నెంబరుకు గానీ పోలీస్ స్టేషనుకు గానీ ఫోన్ చేయాలని సూచించారు.