Share News

ఎంపీ భరత్‌పై అసత్య ప్రచారమని కార్యకర్త ఫిర్యాదు

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:54 AM

ఎంపీ భరత్‌పై సోషల్‌ మీడియాలో, కరపత్రాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్త లక్ష్మణ్‌ కుమార్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.

ఎంపీ భరత్‌పై అసత్య ప్రచారమని కార్యకర్త ఫిర్యాదు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఎంపీ భరత్‌పై సోషల్‌ మీడియాలో, కరపత్రాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్త లక్ష్మణ్‌ కుమార్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఎంపీ భరత్‌ రామ్‌ బీజేపీతో మంతనాల్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘భరత్‌ లవ్‌ 25ు కమీషన్‌.. ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ కాంట్రాక్టు, ఈట్‌ స్ట్రీట్‌, మాదక ద్రవ్యాల ఎగుమతి, గ్రావెల్‌,గ్రానైట్‌, అవభూములు, కంబాల చెరువు, సుబ్రహ్మణ్య మైదానం పనుల్లో 25 శాతం కమీషన్‌.. పనేదైనా.. పర్సంటేజీ చెల్లించాల్సిందే.. 25ు కమీషన్‌ భారత్‌పే రేట్‌ కార్డ్‌’ అంటూ కరపత్రాలు ముద్రించి పంచిపెడుతున్నార న్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కరపత్రాలపై రగడ పది రోజుల నుంచీ నలుగుతోంది.ఎంపీ భరత్‌ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తు న్నా రు. కరపత్రాలు ముద్రించి పంచిపెడుతున్నది ఎవరో తెలి యాలని పోలీసులను ఎంపీ భరత్‌ ఈ నెల 16న ఆదేశించా రు.దీంతో పోలీసులు అదే పనిలో ఉన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:54 AM