Share News

ముక్క..ముప్పు!

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:30 AM

ఈ రోజు ఆదివారం.. తెలవారగానే చేతిలో సంచితో మాంసాహార దుకాణాల వైపు కాళ్లు వడివడిగా అడుగులు పడతాయి..జిహ్వచాపల్యం జివ్వున లాగుతోంది.. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆదివారం మాంచి మషాలా దట్టించి ఏ మేక తలకాయ ఇగురో.. చేపల పులుసో.. పీతల వేపుడో చేసేసుకుని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? సరే.. కానిచ్చేయండి.

 ముక్క..ముప్పు!

మార్కెట్లకు చేరుతున్న నిల్వ మాంసం

యథేచ్ఛగా సాగుతున్న విక్రయాలు

తెలంగాణ నుంచి రాక

ఆదివారమే భారీగా అమ్మకాలు

ఎగబడుతున్న కొనుగోలుదారులు

కన్నెత్తి చూడని అధికారులు

నిద్దరోతున్న ఫుడ్‌ సేఫ్టీ

ఆసుపత్రి బెడ్‌పై ప్రజారోగ్యం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఈ రోజు ఆదివారం.. తెలవారగానే చేతిలో సంచితో మాంసాహార దుకాణాల వైపు కాళ్లు వడివడిగా అడుగులు పడతాయి..జిహ్వచాపల్యం జివ్వున లాగుతోంది.. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆదివారం మాంచి మషాలా దట్టించి ఏ మేక తలకాయ ఇగురో.. చేపల పులుసో.. పీతల వేపుడో చేసేసుకుని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? సరే.. కానిచ్చేయండి. కానీ ఒక్కసారి కొనేవాటి నాణ్యత, తాజాదనాన్ని చూసుకోండి. తెలియకపోతే తెలిసిన వాళ్ల సలహా తీసుకోండి. లేకపోతే ఆరోగ్యానికి ఎసరు పెట్టుకున్నట్టే సుమా!. పెద్ద మార్కెట్లకు వెళ్లినప్పుడు మరీ జాగ్రత్తండోయ్‌! మన ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన శాఖలు ఒకరిపై నెపం నెట్టుకునే జపం వదలడం లేదు మరి! చేపల మొప్పలకు రంగు, కోడి రక్తం పూసేసి అమ్మేసే స్థాయికి ఆహార భద్రత దిగజారి పోయింది. ప్రజారోగ్యం దృష్ట్యా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. ప్రజారోగ్యం అంటే యంత్రాంగానికి చులకన అయి పోయినట్లు కనిపిస్తోంది. అబ్బే.. మాది కాందటే మాది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకొని చివరికి ప్రజల ప్రజారోగ్యాన్ని పైవాడి దయకు వదిలేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మాంసాహార మార్కెట్లు రోగాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. పట్టించుకునేవాళ్లు కనుచూపు మేరలో కనబడకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. తాజా అనే మాటకు ఎప్పుడో స్వస్తి పలికేశారు. మాంసాహారంపై కాస్త అవగాహన ఉంటే పర్లేదు గానీ లేకపోతే కుళ్లిన వాటిని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లి పడేయాల్సిందే. ఒక్కోసారి కూర వండిన తర్వాత ఉసూరు ముంటున్నారు.ఒకవైపు ధరలు,కొలతలపై ఎలాం టి నియంత్రణ లేకపోగా వందలాది రూపాయలు వెచ్చిం చి కొన్నా మంచి సరుకు దొరకడం అదృష్టంగా మారిపో యింది. ఆదివారం అయితే డబ్బులు పెట్టి మరీ రోగాలను కొని తెచ్చుకున్నట్లుగా దుస్థితి దాపురించింది.పాలకులకు ప్రజల ఆరోగ్యం అంటే ఎంత చులకనంటే.. జిల్లాకు ఒకరే ఆహార భద్రతా అధికారి ఉన్నారు.ఆయనకు తనిఖీలకు వెళ్లడానికి ఎలాంటి సదుపాయాలూ లేవు.ప్రజలకు ఎవ రికి ఫిర్యాదు చేయాలో ఎవరూ అవగాహన లేదు.

ఆదివారం అయితే..

ఆదివారం మాంసాహార ప్రియులు చేపలు, రొయ్యలు, పీతలు, మేక, తలకాయమాంసం, కోడి మాంసం తదితర మాంసాహారం కొనుగోలులో బిజీగా ఉంటారు. మార్కెట్లలోని వ్యాపారులు ఇష్టా నుసారం నిల్వ ఉంచిన సరుకును యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. ఉదాహరణకు జిల్లాలోనే పెద్ద మాంసాహార మార్కెట్‌గా చెప్పుకొనే రాజమహేంద్ర వరం జాంపేట మార్కెట్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. బాగా నిల్వ ఉండి, వాసన వస్తున్నా.. ఈగలు విపరీతంగా ముసురుకుంటున్నా అమ్మకా లు సాగించేస్తారు. తెలంగాణలోని హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి మేక తలకాయలు, కాళ్లు, శాల్తీలు వంటివి ఐసు బాక్సుల్లో పెట్టి సర ఫరా చేస్తున్నారు.వాటిలో పాడైపోయినవి ఉంటాయి. వీట న్నింటినీ కాస్త తక్కువ ధరకు అమ్మేస్తుం టా రు. అందుకే జాంపేట మార్కెట్‌లో చాలా తక్కువ ధర ఉంటుందని పట్టణవాసులు చెబుతుంటారు. కలి సి వస్తుందని ఆశ పడి కొనుగోలు చేస్తున్న కొంత మంది వినియోగదారులు మోసపోతున్నారు. అలా కొనుగోలు చేసిన చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. మార్కెట్లలోనే జంతువులను వధించి అమ్మేస్తున్నారు. చేపలు, రొయ్యలు,పీతలు పాడైపో యినవి, కొద్దిసేపట్లో పాడవుతాయనుకున్న వాటినీ అంటగట్టేస్తున్నారు. రోగాలను సరఫరా చేయడానికి ఈగలు ముసురుకుంటున్నాయి.ఒక వైపు సరుకు నాణ్యత అలా ఉంటే.. తూనిక లోనూ మోసాలతో వినియోగదారుల జేబుకు పెద్ద చిల్లే పడుతోంది. తూనికలు కొలతల సిబ్బంది కొరత ఉండడం ప్రజలకు శాపంగా మారింది. ఎలకా్ట్రనిక్‌ కాటాలు ట్యాంపరింగ్‌ చేసేస్తున్నారు. తూకం రాళ్లు ఎప్పటివో తూనికలు కొలతల శాఖకే తెలియాలి. ఇక జాంపేట చికెన్‌ మార్కెట్‌ జిల్లాలోనే పెద్దది. ఇక్కడ శుభ్రత ఉండకపోగా ఎవరి ధరలు వారివే. కనీసం తనిఖీలు లేక ప్రజారోగ్యంతో వ్యాపారులు ఆడుకుంటున్నారు.

ఆహార నియంత్రణ ఏదీ?

మునిసిపల్‌/పంచాయతీ కమేళాలో మేకలు, గొర్రెలను కోసిన తర్వాత ప్రజారోగ్యానికి ఇబ్బంది లేదని వెటర్నరీ వైద్యుడు ఽధ్రువీకరించిన తర్వాతే విక్రయాలు జరపాలి. కానీ వందలో పదిశాతం కూడా ఆ విధానం కానరాదు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో వ్యా పారులు ఇష్టారాజ్యం చేస్తున్నారు.ఇక జిల్లా ఆహార భద్ర త శాఖలో ఒకే అధికారి ఉన్నారు. ఆయనే జిల్లా అంతా తిరుగుతూ తనిఖీలు చేస్తుండాలి.దీంతో ఆహార భద్రతను అభద్రత వెంటాడుతోంది.ఆయనకు ఎలాంటి వాహనం కూడా ప్రభుత్వం తరఫు నుంచి లేకపోవడం గమనార్హం. ఇక వెటర్నరీ,మునిసిపాలిటీ, విజిలెన్స్‌, తూని కలు కొల తల అధికారులు మార్కెట్లవైపు ఎందుకనో కన్నెత్తి చూడ డం లేదు.మార్కెట్‌ నుంచి బయటకు వచ్చేంత వరకూ ముక్కు మూసుకోవాల్సిందే.ఇంత దారుణంగా పరి స్థితు లున్నా కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా అధికా రుల నెంబర్లతో కూడిన బోర్డులు ఎక్కడా కనబడవు.

హైదరాబాద్‌ టు జాంపేట

జిల్లాలోకి ముఖ్యంగా జాంపేట తదితర మాంసాహార మార్కెట్లకు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం రాత్రి సమయంలో నిల్వ ఉన్న మేక, గొర్రె తలకాయలు, కాళ్లు, లివర్‌ వంటి శాల్తీలు ఐస్‌బాక్సులో పెట్టి వ్యానులో తీసుకొచ్చి దిగుమతి చేస్తున్నారని సమాచారం. శనివారం పెద్దగా బేరాలు ఉండవు కాబట్టి వాటిని అలాగే ఐస్‌బాక్సులో నిల్వ ఉంచి ఆదివారం సందట్లో సడేమి యాలో అమ్మేస్తున్నారు. కాస్త తక్కువ ధరకు రావడంతో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు.దీంతో ఒక్కోసారి ప్రజారోగ్యంపైనా ప్రభావం పడుతోంది.

అసలైతే ఇలా చేయాలి

జంతువులను ముందు రోజున వైద్యుడి ముందు (యాంటే మార్టమ్‌) ప్రవేశపెట్టాలి. సాయంత్రం 5 గంటల నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా ఉపవాసం ఉంచాలి. ఆయన ధ్రువీకరించిన వాటినే తరువాత రోజున వధించాలి. కోసిన తర్వాత మాంసం పరీక్షించి మళ్లీ ధ్రువీ కరిస్తారు.జంతువుల భాగాల్లో ఇన్‌ఫెక్షన్‌/కంతుల వంటివి ఉంటే వాటిని తొలగిస్తారు. మాంసాన్ని కడిగి, కట్‌ చేసినప్పుడు మనుషుల స్వేద గ్రంథుల ద్వారా కూడా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిల్వ మాంసం ఉంటే బద్దెపురుగులు, క్షయ, హైడాటిడో సిస్‌, అంత్రాక్స్‌ వంటి రోగాల బారినా పడే ప్రమాదం ఉంది.

ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిందే..

వ్యవస్థలు నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు ఎవరి జాగ్రత్త వారు తీసుకోవడం తప్పదు. అందువల్ల కొనుగోలు చేసే ప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకూ అనా రోగ్యం నుంచి తప్పించుకోవచ్చు.మాంసాహారం దుర్వాసన వస్తే వండడానికి పనిచేయదని తెలుసుకోవాలి. అలాంటి వాటిని తినడం ప్రాణాంతకం. సముద్రం ఉత్పత్తులు సాధారణంగా నిల్వ చేసినవే ఉంటాయి. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నవి తాజాగా ఉండవు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కొనకపోవడమే మంచిది.

అధికారుల మొద్దు నిద్ర...

జిల్లాలో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌, నిడదవోలు, కొవ్వూరు మునిసిపాలిటీలు ఉన్నాయి. జంతువుల వధ, మాంసాహారం తనిఖీల బాధ్యత ప్రధానంగా స్థానిక సంస్థలపై ఉంటుంది.కానీ అవి పట్టించుకున్నట్లు కాన రావడం లేదు. సుమారు ఐదు లక్షల మంది జనాభా పరిధి ఉన్న రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొ రేషన్‌లో ఒక్క మీట్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్‌ కూడా లేరు. మార్కెట్లను తనిఖీలు చేస్తున్నారా? అంటే అదీ అనుమా నమే.రాజమహేంద్రవరం కబేళాలో అదివారమైతే సుమా రు 900 వరకూ.. జిల్లాలో అయితే దాదాపు 2వేల వరకూ మేకలు, గొర్రెలు తదితర జంతువులను వధిస్తారు. ముని సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి లేకపోవడంతో పశుసంవర్థక శాఖ నుంచి డాక్టర్‌ స్లాటర్‌ హౌస్‌కి వెళ్తున్నారు.

ఇలా చెక్‌ చేసుకోండి...

ఫ చేపలు : సాధారణంగా చెరువు, సముద్రం చేపలు విక్రయాలు ఎక్కువగా చేస్తుంటారు. గోదావరి చేపలు పెద్దవి దొరకడం చాలా అరుదు. జెల్లలు, వాలుగులు, ఇసుక దొందులు, పరిగలు వంటి గోదావరి ఉత్పత్తులు మాత్రమే లభ్యమవు తున్నాయి. మోసు, బొచ్చె, రాగండి వంటి చెరువు రకాలు ఎక్కువగా అమ్ముతుంటారు. జాంపేట మార్కెట్లో మొప్పలకు కోడి రక్తం పూసేసి మరీ మోసం చేస్తుంటారు. అందువల్ల చేపలను జాగ్రత్తగా చూసుకొని కొనాలి.చేపలు మెత్తగా ఉండకూడదు. మొప్పలు ఎర్రగా ఉండాలి. కళ్లు తెల్లబారి ఉండకూడదు. ముఖ్యంగా దుర్వాసన రాకూడదు. చిన్న చేపలు త్వరగా పాడవుతుం టాయి.కొరమేను బతికి ఉన్నదే కొనాలి.

ఫ రొయ్యలు : మెత్తగా ఉండకూడదు. తలలు వాటికవే ఊడిపోతుంటే నిల్వ సరుకని అర్ధం. రొయ్య పైపొట్టు మెత్తగా ఉండకూడదు. చెరువు రొయ్యల్లో కొన్ని రకాల్లో పైభాగంలో చిన్న నరంలా నల్లగా కనబడుతుంది. దానిని తీసే యాలి.రొయ్య వ్యర్థాలు ఆ నరంలో ఉంటాయి. గోదావరి రొయ్యలంటూ చెరువు రొయ్యలు అమ్ముతుంటారు. జిల్లాలో అక్కడక్కడా వ్యాన్‌లు పెట్టి నిల్వ ఉన్న రొయ్యలనే కిలో రూ.100 రూ.150లకు విక్రయిస్తుంటారు.

ఫ పీతలు : పీతలు బరువుగా ఉండాలి. నీరుగారి పోయినట్లు తేలిగ్గా ఉంటే పాడవడానికి దగ్గరపడిందని అర్ధం చేసుకోవాలి. పీతలు బాగు చేయించిన తర్వాత ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో పెట్టుకో వాలి. పీతల కాళ్లు, డెక్కలు సులభంగా విరిగిపోతే కాస్త నిల్వ సరుకని తెలుసుకోవాలి.

ఫ తలకాయ మాంసం : తలకాయ మాంసంలో రెండు రకాలు.. మేక, గొర్రె తలకాయలను అమ్ముతుంటారు. తాజాగా లేని తలకాయలు, కాళ్లు తక్కువ ధరకు వచ్చేస్తున్నాయని అస్సలు కొనరాదు. నిల్వ చేసినవి, ఐస్‌లో పెట్టినవి ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. తలకాయ పైచర్మం అక్కడక్కడా ఊడిపోయి ఉంటే నిల్వ చేసినదని అర్ధం చేసుకోవాలి. ఇక మేక మాంసం అయితే గొర్రెది అమ్ముతారు. ఎందుకంటే గొర్రె మాంసం కాస్త తక్కువ ధర ఉంటుంది. మేక మాంసం అమ్మకాలు తక్కువగా ఉంటాయి. దీంతో చాలా వరకూ నిల్వ మాంసమే విక్రయిస్తారు. అయినా ఎవరూ పట్టించుకోరు.

ఫ చికెన్‌ : ప్రస్తుతం చికెన్‌ అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి.. బ్రాయిలర్‌ కోళ్లు ప్రతి రోజూ ఒకటో రెండో చచ్చిపోతూనే ఉంటాయి. ఫారంలో అయితే వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయా కోళ్లను సేకరించి విక్రయించేవారు ఉన్నారు. అసలు బ్రాయిలర్‌ చికెన్‌ తినకూడదనేది పెద్దల మాట.. అయినా తినేస్తున్నాం.. బతికిన కోడి చికెన్‌ తింటే బెటర్‌..

నిల్వ మాంసం తినకూడదు..

నిల్వ మాంసాహారాన్ని తినకూ డదు. మాంసం తనిఖీ చేయిం చారా లేదా అనేది ప్రశ్నించి.. అధికారులు వేసే సీలును గమ నించాలి. గర్భంతో ఉన్నా, ప్రత్యు త్పత్తికి ఉపయోగపడే, జ్వరంతో బాధపడే, చనిపోయిన పశువులను వధించి విక్రయించరాదు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిత వ్యాధులు(జూనోటిక్‌ డిసీజెస్‌) రాకుండా నివారించవచ్చు.

- డాక్టర్‌ ఎస్‌టీజీ సత్యగోవింద్‌, జిల్లా పశుసంవర్థక అధికారి

మార్కెట్లను తనిఖీ చేస్తాం

మాంసాహార మార్కెట్లను ముఖ్యంగా వెటర్నరీ వాళ్లు పరిశీలించాలి. కానీ మేం కూడా చూస్తాం. ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేస్తాం. నాణ్యతా ప్రమాణాలు పాటించక పోతే జరిమానాలు విధించడంతో పాటు కేసులు పెడతాం. - వి.రుక్కయ్య, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి

Updated Date - Jan 28 , 2024 | 12:30 AM