పిఠాపురం.. ఇక నా స్వస్థలం
ABN , Publish Date - Apr 02 , 2024 | 01:10 AM
‘పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చా. నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు తీసుకుని ఉంటా. నన్ను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచింది. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామ’ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి నా బాధ్యత
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
జనసేన అధినేత పవన్‌కల్యాణ్
జనసేనలో భారీగా చేరికలు
పిఠాపురం, ఏప్రిల్ 1: ‘పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చా. నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు తీసుకుని ఉంటా. నన్ను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచింది. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామ’ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్ లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రముఖులు, వైసీపీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పవన్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గంలోని అందరినీ వ్యక్తిగతంగా కలవాలన్న ఆశ తనకు ఉన్నప్పటికీ భద్రతాపరమైన కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్ తెలిపారు. ప్రత్యర్థుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. భద్రతాపరమైన ప్రొటోకాల్ పాటిస్తూ రోజుకి 200 మందిని కలిసి వారితో ఫొటోలు తీసుకుంటానని తెలిపారు. శ్రీపాదశ్రీవల్లభుడు, పురుహూతికా అమ్మవారు, బషీర్ బీబీ (బంగారు పాప) దర్గా, ఆంధ్రా బాప్టిస్టు చర్చి సాక్షిగా ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను భగవంతుడినీ ఏదీ కావాలని కోరుకోనని, అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో నల్గొండకు చెం దిన అభిమాని వచ్చి ఒక్క హిట్ ఇవ్వు అన్నా అని అడిగాడు. అప్పుడు ఒక్క హిట్ ఇవ్వమని, భీమవరంలో ఓడిపోయిన తర్వాత గెలుపు ఇవ్వమని భగవంతుడిని కోరానని, ఆ మేరకు తనను పిఠాపురం పిలిచిందని చెప్పారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఉండాలన్నదీ త్వరలో నిర్ణయించుకుంటాని, పురుహూతికా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుని ఉంటానన్నారు. పగిలే గాజు గ్లాసుకు పదును ఎక్కువన్నారు. అందరినీ ప్రత్యేకించి కలుస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలనూ తెలుసుకుంటానని తెలిపారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. అం దుకు కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నిదర్శనమన్నారు. వచ్చే 25 సంవత్సరాల్లో కొత్తతరం నాయకులు ముందుకు రావాలని కోరారు. ఇప్పటి నుంచీ నిలబడితేనే రేపటి రోజున నాయకులు తయారవుతారని తెలిపారు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి మండల, గ్రామస్థాయి వరకు నాయకులను తయారు చేస్తుందని చెప్పారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందరరెడ్డి, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు వేములపాటి అజయకుమా ర్, పి.హరిప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, కె.శరత్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాస్, తెలంగాణా ఇన్‌చార్జి ఎన్.శంకరగౌడ్, మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా పిఠాపురం నియో జకవర్గం, ఇతర ప్రాంతాల ప్రముఖులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వారిలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ వరలక్ష్మి, న్యాయవాదులు సూరవరపు వెంకటేశ్వరరావు, త్రినాథ్, వెంకటరమణ, అరుణ్‌బాబు, కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గండి శకుంతలాదేవి, వంతల నందీశ్వరి, సూరవరపు సురేష్, మారిశెట్టి బుజ్జి, ఊటా సత్యనారాయణ, ఎలుబండి ప్రభు, డాక్టర్ ఆర్.మోహనరావు, కోడిగుడ్డి రాజేష్, గారపాటి శ్రీనివాసరావు, బస్సా ప్రసాద్, మేరుగు జగదీష్, ఎండీ జాఫర్ షరీఫ్, షేక్ ఖాదీర్, నజీర్, అబ్దుల్ ఖయూమ్, లోకారెడ్డి రామకృష్ణ, బొజ్జా లోవరాజు, యా పాటి అరుణ్‌బాబు, కుక్కా శ్రీను ఉన్నారు.
మంగళవారం పర్యటన ఇలా..
సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు గొల్లప్రోలులోని హెలిపాడ్‌కు చేరుకున్న పవన్‌కల్యాణ్ సాయంత్రం 5.15 గంటలకు గొల్లప్రోలు హెలిపాడ్ నుంచి హైదరాబాదుకు హెలికాఫ్టర్‌లో పయనమయ్యారు. ఆయన తిరిగి మంగళవా రం నియోజకవర్గానికి వస్తారు. ఉదయం 9 గంటలకు హెలిపాడ్ నుంచి బయ లుదేరి పిఠాపురంలోని ఏబీసీ (ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్)కు, తర్వాత కొత్తపల్లి మం డలం పొన్నాడలోని బషీర్‌బీబీ దర్గా (బంగారు పాప)లకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత యు కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాలులో మహిళలతో సమావేశంలో పాల్గొంటారు. అక్కడ నుం చి పిఠాపురం చేరుకుని వివిధ జంక్షన్లలో పర్యటిస్తారు. ఆయా కార్యక్రమాల్లో ప్ర జలు పెద్దఎత్తున పాల్గొనాలని జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.
జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్
పిఠాపురం, ఏప్రిల్ 1: జనసేన పార్టీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు చేరేందుకు పిఠాపురం వేదిక అయ్యింది. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలోని గోకులం గ్రాండ్ హోటల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మం డలి బుద్ధప్రసాద్, పాలకొండ నియోజకవర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ, రైల్వేకోడూరు నియోజకవర్గం సర్పంచ్ శ్రీధర్ పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పవన్ సాదర స్వాగతం పలికారు. పార్టీలో చేరిన అనంత రం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీకి నిలవమని పవన్ తనను కోరగా చంద్రబాబు మద్దతు ఇచ్చారన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీలో జరగని అరాచకం లేదని మండిపడ్డారు. వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. తెలుగు భాషాభివృద్ధికి తాను చేసిన కృషిని పవన్ ఎన్నోసార్లు మెచ్చుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నా రు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ తనకు సీటు వస్తుందని ఆశి స్తున్నట్టు చెప్పారు. పాలకొండలో వైసీపీ నాయకుల అక్రమాలు దారుణంగా ఉన్నాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.