Share News

పిఠాపురంలో అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

ABN , Publish Date - May 22 , 2024 | 01:21 AM

పిఠాపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నేత లు రాస్తారోకోకి దిగారు.

పిఠాపురంలో అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకో

పిఠాపురం, మే 21: పిఠాపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నేత లు రాస్తారోకోకి దిగారు. పిఠాపురం పట్టణంలో ని అగ్రహారం పశువుల సంత సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు గాట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం సాయంత్రం అక్క డకు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పిఠాపురం ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్‌ భారీగా జామ్‌ అయింది. న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పిఠాపురం ఇన్‌చార్జి సీఐగా ఉన్న సర్పవరం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, పిఠాపురం ఎస్‌ఐ మురళీమోహన్‌, అదనపు ఎస్‌ఐ వెంకటేష్‌లు అక్కడకు చేరుకున్నారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఆందోళనకారులతో మాట్లాడారు. దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి అరెస్టు చేస్తామని సీఐ వైఆర్‌కే హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం దళిత సంఘాల నాయకులతో కలిసి సీఐ అంబేద్కర్‌ విగ్రహానికి రంగు వేసి పాలాభిషేకం నిర్వహించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపా

Updated Date - May 22 , 2024 | 07:11 AM