కొమరగిరిలో పంట కాలువను పరిశీలిస్తున్న వర్మ
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:08 AM
కొత్తపల్లి, జూలై 7: పంట కాలువల్లో తూడు తొలగించి ఆకుమడులను పెంచుకోవడానికి సాగునీరు సరఫరా చేయాలని టీడీపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఇరిగేషన్ అధికారులను కోరారు. పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ)కింద ఉన్న కొత్తపల్లి మం డలం కొమరగిరి, కుతుకుడుమల్లి తదితర గ్రా మాల్లో సార్వా వరిసాగు ఆకుమడులకు నీరులేక రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వర్మ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆయా గ్రామాల్లో

తూడు తొలగించి సాగునీరు సరఫరా చేయాలి
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
కొత్తపల్లి, జూలై 7: పంట కాలువల్లో తూడు తొలగించి ఆకుమడులను పెంచుకోవడానికి సాగునీరు సరఫరా చేయాలని టీడీపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఇరిగేషన్ అధికారులను కోరారు. పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ)కింద ఉన్న కొత్తపల్లి మం డలం కొమరగిరి, కుతుకుడుమల్లి తదితర గ్రా మాల్లో సార్వా వరిసాగు ఆకుమడులకు నీరులేక రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వర్మ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆయా గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. పీబీసీ ద్వారా సాగు నీరు బిక్కవోలు వరకు బాగానేవస్తుందని, అక్క డ వంతెన వద్ద తూడుకాడ పేరుకుపోవడంతో నీరు ముందుకు ప్రవహించడంలేదని వర్మ అధి కారులకు తెలిపారు. వంతెన కింద నీరు పారడా నికి అడ్డంగా ఉన్న తూడుకాడను వెంటనే తొలగి ంచి సాగునీరు అందించాలని కోరారు. రాబోయే రెండు,మూడు రోజుల్లో పీబీసీకి పూర్తిస్థాయిలో సాగునీరందించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని వర్మ రైతులకు హామీఇచ్చారు. కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, మాజీ జడ్పీటీసీ బత్తుల చైతన్య రాజేష్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కుక్కల రామకృష్ణ, గోర్స సర్పంచ్ రొంగళ్ళ వీరబాబు, యండపల్లి గణేష్, రైతు నాయకులు ఉన్నారు.