పేదల కోసం రంగబాబు నిరంతరం కృషి
ABN , Publish Date - Aug 28 , 2024 | 12:07 AM
గొల్లప్రోలు, ఆగస్టు 27: పేద ప్రజల సంక్షేమం కోసం రంగబాబు నిరంతరం పనిచేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత మాదేపల్లి రంగబాబు వర్దంతిని మంగళవారం గొల్లప్రోలులో నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలు, ఆగస్టు 27: పేద ప్రజల సంక్షేమం కోసం రంగబాబు నిరంతరం పనిచేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత మాదేపల్లి రంగబాబు వర్దంతిని మంగళవారం గొల్లప్రోలులో నిర్వహించారు. రంగబాబు ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి ప్రదర్శనగా పట్టణంలోని మెయిన్‌రోడ్డులో గల రంగబాబు విగ్రహం వద్దకు చేరుకుని వర్మ, పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదేపల్లి వినీల్‌వర్మ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, నగరపంచాయతీ మాజీ చైర్మన్ శీరం మాణిక్యం, టీడీపీ నాయకులు బస్సా సత్యనారాయణ, కడారి బాబ్జి, దువ్వా తాతాజీ, గండే నాగేశ్వరరావు పాల్గొన్నారు. బి.ప్రత్తిపాడులోని పీఎం ఆర్ విద్యామందిర్‌లో రంగబాబు వర్దంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులతో పాటు డైరెక్టరు విజయకుమార్, కరస్పాండెంట్ నాగినిచంద్ర, చైర్మన్ మాదేపల్లి వినీల్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
లీజు గడువు పెంచాలి
గొల్లప్రోలు, ఆగస్టు 27: పట్టణంలోని రాజు చెరువులో చేపలు పట్టుకునేందుకు మత్స్యకార సొసైటీకి ఉన్న లీజు గడువు నెలాఖరుతో ముగుస్తున్నదని, ప్రభుత్వ జీవో ప్రకారం దాని గడువు పెంచాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గొల్లప్రోలు నగరపంచాయతీ కమిషనరు రవికుమార్‌ను కలిసి లీజు పొడిగింపులో జాప్యం ఎందుకు జరుగుతున్నదని ప్రశ్నించారు. చెరువును మత్స్యకార సొసైటీకి అప్పగించి లీజు గడువు పెంచాలని మన్సిపల్ ఆర్డీని కోరారు. టీడీపీ నాయకులు, మత్స్యకార సొసైటీ ప్రతినిధులు ఉన్నారు.