Share News

సాగునీరందించాలని కోరాను

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:08 AM

పిఠాపురం, జూలై 4: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినప్పుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తాను పదవి కోరలేదని, రైతులు కోసం పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించి సాగునీరు అందించాలని కో

సాగునీరందించాలని కోరాను
సమావేశంలో మాట్లాడుతున్న వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, జూలై 4: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినప్పుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తాను పదవి కోరలేదని, రైతులు కోసం పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించి సాగునీరు అందించాలని కోరానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. అన్న మాట ప్రకారం పథకాన్ని ప్రారంభించి గోదావరి జలాలను విడుదల చేయడం జరిగిందని చెప్పా రు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆ యన మాట్లాడుతూ సాగునీటి కోసం పిఠాపురం నియోజకవర్గ రైతులు పడుతున్న కష్టాలను చంద్రబాబు పాదయాత్ర సమయంలో స్వయంగా చూశారని, తాను ఎమ్మె ల్యేగా ఉండగా ఆయనను ఒప్పించి రూ.1750కోట్లుతో పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి 9నెలల్లో ప్రారంభించడం జరిగిందన్నారు. తాను సీటు త్యాగం చేసినప్పు తనకు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకానికి సాగునీరు విడుదల చేసిన నీటిపారుదలశాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పదవులు కోసం ఆశ పడకుండా రైతులు బాగుకోసమే తాను పనిచేశానని తెలిపారు. మరో 2రోజుల్లో పురుషోత్తపట్టణ ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరతాయని తద్వారా రైతులకు పంటలు పండించేందుకు సాగునీటి కష్టాలు ఉండవన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొండేపూడి సూర్యప్రకాష్‌, సకుమ ళ్ల గంగాధర్‌, గుండ్ర సుబ్బారావు, మడికి ప్రసాద్‌, నామా దొరబాబు, సోము సత్యనారాయణ, పిల్లి చిన్నా ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:08 AM