Share News

నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి : వర్మ

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:50 PM

పిఠాపురం, జూన్‌ 9: టీడీపీ, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, వివాదాలకు తావిచ్చే రీతిలో వ్యవహరించవద్దని

నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి : వర్మ
పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వర్మ

పిఠాపురం, జూన్‌ 9: టీడీపీ, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, వివాదాలకు తావిచ్చే రీతిలో వ్యవహరించవద్దని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కోరారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆలయాల నిర్వహణపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. అమరావతిలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. కూటమి పార్టీలన్ని సమష్టిగా పనిచేసి జనసేన అధినేత పవన్‌ను రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించుకున్నామని గుర్తు చేశారు. అదే స్పూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పవన్‌ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో పరిష్కరించుకుందామని, ప్రజలకు అండగా నిలుద్దామన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12వ తేదిన గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రమాణస్వీకారం చేయనున్న స్థలంలో ఏర్పాట్లుకు ఆదివారం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:50 PM