Share News

మద్యం షాపు వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:25 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 27: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని సినిమాసెంటర్‌ వద్ద గల ప్రభుత్వ మద్యం షాపు వద్ద మద్యం బాటిళ్లతో శనివారం నిరసన తెలిపారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురంలో నాలుగుచోట్ల కోటి రూపాయిల విలువైన మద్యం పట్టుబడిందని, అవన్ని వైసీపీ నేతల గృహాలేనని చెప్పారు. నియోజకవ

మద్యం షాపు వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన
పిఠాపురంలో మద్యం బాటిళ్లతో నిరసన తెలుపుతున్న వర్మ

పిఠాపురం, ఏప్రిల్‌ 27: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని సినిమాసెంటర్‌ వద్ద గల ప్రభుత్వ మద్యం షాపు వద్ద మద్యం బాటిళ్లతో శనివారం నిరసన తెలిపారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురంలో నాలుగుచోట్ల కోటి రూపాయిల విలువైన మద్యం పట్టుబడిందని, అవన్ని వైసీపీ నేతల గృహాలేనని చెప్పారు. నియోజకవర్గంలో రూ.7 కోట్లు విలువైన మద్యం ఉందని ఆరోపించారు. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులు గొల్లప్రోలులో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారని, పిఠాపురంలోని వైఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఆరు ఇళ్లు అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ఇంటికి లక్ష రూపాయిలు పంచేందుకు వైసీపీ సిద్ధపడుతున్నదని ఆరోపించారు. మద్యం దొరికన ఇళ్లుకు సంబంధించిన వైసీపీ నేతలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను అరెస్టు చేయాలని, డబ్బు ఎక్కడ దాచారో పోలీసులు వెలికితీయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 12:25 AM