Share News

రికార్డు విజయం సాధించబోతున్న పవన్‌

ABN , Publish Date - May 14 , 2024 | 11:44 PM

పిఠాపురం, మే 14: పిఠాపురం నుంచి కూట మి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రికార్డుస్థాయి మెజార్టీతో విజయం సా ధించబోతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ విజయం కోసం తనతో పాటు టీడీపీ శ్రేణులంతా రాత్రింబవళ్లు అలుపెరగకుండా శ్రమించారని చెప్పారు. నియోజకవర్గంలో పవన్‌కు ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారని, అర్థ రాత్రి వరకూ ఓటింగ్‌ జరగడమే ఇందుకు

రికార్డు విజయం సాధించబోతున్న పవన్‌
పిఠాపురం సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

టీడీపీ శ్రేణులు అలుపెరగకుండా శ్రమించారు

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, మే 14: పిఠాపురం నుంచి కూట మి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రికార్డుస్థాయి మెజార్టీతో విజయం సా ధించబోతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ విజయం కోసం తనతో పాటు టీడీపీ శ్రేణులంతా రాత్రింబవళ్లు అలుపెరగకుండా శ్రమించారని చెప్పారు. నియోజకవర్గంలో పవన్‌కు ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారని, అర్థ రాత్రి వరకూ ఓటింగ్‌ జరగడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. టీడీపీ పిఠాపురం నియోజకవర్గంలో బలంగా ఉందని, ఆ ఓటు అంతా పవన్‌కు బదిలీ అయిందని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలకు అనుగుణంగా తనతో పాటు కేడర్‌ అంతా పనిచేశారని, ఎవరితో వేలెత్తి చూపకుండా పనిచేశారని పేర్కొంటూ నాయకులు, కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నారని తెలిపారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లోని 50వార్డులు, 39 గ్రామాల్లో ప్రచారం నిర్వహించి అందరిని ఓటు అభ్యర్థించారని తెలిపారు. వైసీపీ నేతలు ఎన్నికల్లో నెగ్గేందుకు చేసిన కుట్రలు, నాటకాలు, జిమ్మిక్కులను ప్రజలు గుర్తించి తిప్పికొట్టారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను పలు చోట్ల బూత్‌ల్లోకి రానివ్వలేదని, ఎక్కడిక్కడ ప్రజలు నిలదీశారని తెలిపారు. వైసీపీ దుష్టపరిపాలనకు చరమగీతం పాడాలనే కసితో ప్రజలు ఓటు వేశారని వర్మ చెప్పారు. సమావేశంలో టీడీపీ నేతలు కొండేపూడి సూర్యప్రకాష్‌, సకుమళ్ల గంగాధర్‌, అనిశెట్టి సత్యానందరెడ్డి, అల్లవరపు నగేష్‌, మలిరెడ్డి వెంకటరమణ, దొడ్డి నాగు, అడ్డగర్ల శివ తదితరులు ఉన్నారు.

Updated Date - May 14 , 2024 | 11:44 PM