Share News

‘రాష్ట్ర సంపదను లూటీ చేసిన వైసీపీ నేతలు’

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:01 AM

పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 24: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వైసీపీ నేతలు మాఫియాగా ఏర్పడి రూ.50వేల కోట్లు రాష్ట్ర సంపదను లూటీ చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం గోకివాడ

‘రాష్ట్ర సంపదను లూటీ చేసిన వైసీపీ నేతలు’

పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 24: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వైసీపీ నేతలు మాఫియాగా ఏర్పడి రూ.50వేల కోట్లు రాష్ట్ర సంపదను లూటీ చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం గోకివాడలో శనివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్జీటీ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్రంలో ఇసుకదోపిడి మాత్రం ఆగలేదని వర్మ విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బర్ల అప్పారావు, నామా పద్దరాజు, లక్ష్మీనారాయణ, దాసం సత్తిబాబు, నాగబాబు, శ్రీను, అడ్డగర్ల శివ, చిరంజీవిరాజు పాల్గొన్నారు.

పిఠాపురం: సూర్యరాయ డిగ్రీ కళాశాలలో తొలిసారి ఓటుహక్కు పొందిన విద్యార్థులతో మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే వర్మ మాట్లాడారు. అర్బ న్‌బ్యాంకు మాజీ చైర్మన్‌ దేవరపల్లి రామారావు, తెలుగు యువత, తెలుగు మహిళ పిఠాపురం నియోజకవర్గ అధ్య క్షులు నల్లా శ్రీను, పంపనబోయిన అన్నపూర్ణ, రావు అక్షయ్‌, ప్రవేట్‌ టీచర్స్‌ యూనియన్‌ అధ్య క్షుడు సుంకర అనిల్‌కుమార్‌ తదితరులున్నారు.

ఎం.శేఖర్‌బాబు పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎం.పపన్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:01 AM