Share News

నిధులు తీసుకొస్తే రద్దు చేయించారు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:09 AM

గొల్లప్రోలు, ఫిబ్రవరి 6: వరద ముంపు నుంచి శాశ్వత రక్షణ కోసం ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు రూ.156కోట్లు నిధులను పోరాడి తాను తీసుకువస్తే వైసీపీ ప్రజాప్రతినిధులు అవి అవ సరం లేదంటూ రద్దు చేయించారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు పట్టణంలోని 12,15వ వార్డుల్లో మంగళవారం సా యంత్రం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ కార్యక్రమాల

నిధులు తీసుకొస్తే రద్దు చేయించారు
గొల్లప్రోలులో ప్రచారం నిర్వహిస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు, ఫిబ్రవరి 6: వరద ముంపు నుంచి శాశ్వత రక్షణ కోసం ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు రూ.156కోట్లు నిధులను పోరాడి తాను తీసుకువస్తే వైసీపీ ప్రజాప్రతినిధులు అవి అవ సరం లేదంటూ రద్దు చేయించారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు పట్టణంలోని 12,15వ వార్డుల్లో మంగళవారం సా యంత్రం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలను నిర్వహి ంచారు. టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు వివరించారు. గొల్లప్రోలు పట్టణంలోని కాలనీలన్ని తరచూ ముంపునకు గురవుతుండడంతో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అప్పటి ముఖ్యమంత్రి ద్వారా తాను నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. టెండర్లు ఖరారై, పనులు ప్రారంభించిన తర్వాత ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ పనులు అవసరం లేదని చెప్పి లేఖ ఇవ్వడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా గొల్లప్రోలు నగరపంచాయతీని రూ.240కోట్లుతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. రూ.70కోట్లుతో మంచినీటి పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. రానున్న రోజుల్లో ఇళ్లు లేని వారందరికి స్థలాలు కేటాయించి గృహనిర్మాణానికి నిఽదులు ఇస్తామని తెలిపారు. ఎన్నికల ముందు వచ్చే నాయకులు అధి కారం, దోచుకోవడానికే వస్తారని... ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి మధ్యే ఉం టున్న తనకు అండగా నిలవాలని వర్మ కోరారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:09 AM