ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న వైసీపీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:09 AM
పిఠాపురం, ఫిబ్రవరి 5: పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని ఖాళీ స్థలాలను వైసీపీ కౌన్సిలర్లు కబ్జా చేస్తున్నారని, వీటి విలువ రూ.70కోట్లు ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఆరోపించారు. జగ్గయ్యచెరువు కాలనీలో సోమవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పర్యటించారు. ఆక్రమణలకు గురవుతున్న స్థలాల వద్ద వర్మ సె
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం, ఫిబ్రవరి 5: పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని ఖాళీ స్థలాలను వైసీపీ కౌన్సిలర్లు కబ్జా చేస్తున్నారని, వీటి విలువ రూ.70కోట్లు ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఆరోపించారు. జగ్గయ్యచెరువు కాలనీలో సోమవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పర్యటించారు. ఆక్రమణలకు గురవుతున్న స్థలాల వద్ద వర్మ సెల్ఫీ తీసుకుని వైసీపీ కౌన్సిలర్ల చేతిలో కబ్జాకు గురైన నిరుపేదల స్థలాలు-ఇది నేటి పాలకుల పాలన దుస్థితి అంటూ సామాజిక మాధ్యమా ల్లో పోస్టు చేశారు. వర్మ మాట్లాడుతూ మరణించిన ఎమ్మార్వో పేరు మీద పట్టాలు పుట్టిస్తూ పేదల పట్టాలను కౌన్సిలర్లు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు ఎకరం భూమిని రాత్రివేళ చదును చేశారని, దాని పక్కనే 3స్థలాల్లో పిల్లర్స్ వేసి నిర్మాణాలు చేపట్టారని దీనిపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిట ని ప్రశ్నించారు. ఆఖరికి పార్కులు కూడా వదలడం లేదని తెలిపారు. దీనిపై కలెక్టరు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, వార్డు ఇన్‌చార్జి వాసంశెట్టి సూరిబాబు, ఆగంటి లోవ, సంతోష్, కర్రి లోవరాజు, గరగపాటి రమణ, గాయత్రి, దుర్గాప్రసాద్, మౌళి, తనుకులయ్య, చోటు, నూకరాజు, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్, పిల్లి చిన్నా, దేవరపల్లి రామారావు, నామా దొరబాబు, కొరుప్రోలు శ్రీను, సోము సత్యనారాయ ణ, నల్లా శ్రీను, మొల్లి నాగమరిడిరాజు ఉన్నారు.