Share News

పవన్‌ బహిరంగసభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:52 PM

పిఠాపురం, ఏప్రిల్‌ 19: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 23వ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారని, అదేరోజు సాయంత్రం ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొంటారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పవన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు.

పవన్‌ బహిరంగసభను విజయవంతం చేయాలి

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, ఏప్రిల్‌ 19: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 23వ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారని, అదేరోజు సాయంత్రం ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొంటారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పవన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఎన్ని కల కమిటీని వర్మ ప్రకటించారు. ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి సూర్యప్రకాష్‌ వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా కౌన్సిలర్లు అల్లవరపు నగేష్‌, పంపనబోయిన అన్నపూర్ణ, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను, అయితే రాంబాబులతో పాటు పిల్లి చిన్నా, నామా దొరబాబు, సూరవరపు సుబ్బారావు, కొరుప్రోలు శ్రీను, మొల్లి నాగమరిడిరాజు, నల్లా శ్రీను, వేణుం సురేష్‌, నూతాటి ప్రకాష్‌, ఆలం సూరిబాబు, మసకపల్లి రాజా, యాళ్ల గణేష్‌లు నియమితులయ్యారు.

ప్రత్యర్థుల జిమ్మిక్కులను తిప్పికొడదాం

కొత్తపల్లి, ఏప్రిల్‌ 19: రాబోయే ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి పవన్‌కళ్యాణ్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులు చేసే జిమ్మిక్కులను తిప్పికొట్టి ప వన్‌ను భారీ మెజార్టీతో నెగ్గించుకుందామని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అన్నా రు. ఇసుకపల్లి, ఉప్పరగూడెం, తోటూరు గ్రామాల్లో పవన్‌కు మద్దతుగా ఆయన ప్రచా రం చేపట్టారు. అనిశెట్టి సత్యానందరెడ్డి, నడింపల్లి సత్యనారాయణరాజు, నడింపల్లి చంటి రాజు, బండి నాగేంద్ర, గుండ్ర జగ్గారావు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:52 PM